చిత్రం: నీ స్నేహం (2002)
సంగీతం: R.P. పట్నాయక్ రచన: సీతారామ శాస్త్రి గాయని: కే.కేపల్లవి:
ఊరుకో హృదయమా ఉప్పెనై రాకుమా
మాట మన్నించుమా బయటపడిపోకుమా
చెయ్యెత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాలా
నీపేరు నిట్టూర్పుల జ్వాలా ప్రణయమా
ఊరుకో హృదయమా ఉప్పెనై రాకుమా
చరణం:1
చూపులో శూన్యమే పెంచుతూ ఉన్నది
జాలిగా కరుగుతూ అనుబంధం
చెలిమితో చలువనే పంచుతూ ఉన్నది
జ్యోతిగా వెలుగుతూ ఆనందం
కలత ఏ కంటిదో మమత ఏ కంటిదో
చెప్పలేనన్నది చెంప నిమిరే తడి
చెయ్యెత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాలా
నీ పేరు నిట్టూర్పుల జ్వాలా ప్రణయమా
చరణం:2
దేహమే వేరుగా స్నేహమే పేరుగా
మండపం చేరనీ మమకారం
పందిరై పచ్చగా ప్రేమనే పెంచగా
అంకితం చేయనీ అభిమానం
నుదిటిపై కుంకుమై మురిసిపో నేస్తమా
కళ్ళకే కాటుకై నడచిపో స్వప్నమా
చెయ్యెత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాలా
నీ పేరు నిట్టూర్పుల జ్వాలా ప్రణయమా
ఊరుకో హృదయమా ఉప్పెనై రాకుమా
మాట మన్నించుమా బయటపడిపోకుమా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి