Nee Sneham లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Nee Sneham లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

30, అక్టోబర్ 2022, ఆదివారం

Nee Sneham : Ooruko Hrudayama Song Lyrics (ఊరుకో హృదయమా)

చిత్రం: నీ స్నేహం (2002)

సంగీతం: R.P. పట్నాయక్ రచన: సీతారామ శాస్త్రి గాయని: కే.కే




పల్లవి: ఊరుకో హృదయమా ఉప్పెనై రాకుమా మాట మన్నించుమా బయటపడిపోకుమా చెయ్యెత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాలా నీపేరు నిట్టూర్పుల జ్వాలా ప్రణయమా ఊరుకో హృదయమా ఉప్పెనై రాకుమా చరణం:1 చూపులో శూన్యమే పెంచుతూ ఉన్నది జాలిగా కరుగుతూ అనుబంధం చెలిమితో చలువనే పంచుతూ ఉన్నది జ్యోతిగా వెలుగుతూ ఆనందం కలత  ఏ కంటిదో మమత ఏ కంటిదో చెప్పలేనన్నది చెంప నిమిరే తడి చెయ్యెత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాలా నీ పేరు నిట్టూర్పుల జ్వాలా ప్రణయమా చరణం:2 దేహమే వేరుగా స్నేహమే పేరుగా మండపం చేరనీ మమకారం పందిరై పచ్చగా ప్రేమనే పెంచగా అంకితం చేయనీ అభిమానం నుదిటిపై కుంకుమై మురిసిపో నేస్తమా కళ్ళకే కాటుకై నడచిపో స్వప్నమా చెయ్యెత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాలా నీ పేరు నిట్టూర్పుల జ్వాలా ప్రణయమా ఊరుకో హృదయమా ఉప్పెనై రాకుమా మాట మన్నించుమా బయటపడిపోకుమా






4, మే 2022, బుధవారం

Nee Sneham : Chinuku Thadiki Song Lyrics (చినుకు తడికి చిగురు)

చిత్రం: నీ స్నేహం (2002)

సంగీతం: RP. పట్నాయక్ రచన: సీతారామ శాస్త్రి గాయని: ఉష చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా? మువ్వలే మనసుపడు పాదమా ఊహలే ఉలికిపడు ప్రాయమా హిందోళంలా సాగే అందాల సెలయేరమ్మా ఆమని మధువనమా పసిడివేకువలు పండువెన్నెలలు పసితనాలు పరువాలవెల్లువలు కలిపి నిన్ను మలిచాడో ఏమో బ్రహ్మ పచ్చనైన వరిచేల సంపదలు అచ్చతెలుగు మురిపాలసంగతులు కళ్ళముందు నిలిపావే ముద్దుగుమ్మా పాలకడలి కెరటాల వంటి నీ లేతఅడుగు తన ఎదను మీటి నేలమ్మ పొంగెనమ్మా ఆగని సంబరమా వరములన్ని నిను వెంటబెట్టుకొని ఎవరి ఇంట దీపాలు పెట్టమని అడుగుతున్నవే కుందనాల బొమ్మ? సిరులరాణి నీ చేయి పట్టి శ్రీహరిగా మారునని రాసిపెట్టి ఏ వరుని జాతకం వేచి ఉన్నదమ్మా? అన్నమయ్య శృంగారకీర్తనల వర్ణనలకు ఆకారమైన బంగారు చిలకవమ్మా రాముని సుమశరమా



1, జులై 2021, గురువారం

Nee Sneham : Kontha kalam Kindata Song Lyrics (కొంతకాలం కిందట )

చిత్రం: నీ స్నేహం

సంగీతం: R.P.పట్నాయక్

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం:  R.P.పట్నాయక్,రాజేష్



కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట

రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం

రూపు రేఖలు వేరట ఊపిరొకటే చాలట

ఆ వరాన్నే స్నేహమంటున్నాం మనం

కంటిపాపని కాపు కాసే జంట రెప్పల కాపలాగా

నిండు చెలిమికి నువ్వూ నేను నీడనివ్వాలి

స్నేహమంటే రూపులేని ఊహకాదని లోకమంతా

నిన్నూ నన్నూ చూడగానే నమ్మితీరాలి

కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట

రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం


బొమ్మ బొరుసులేని నాణేనికి విలువుంటుందా

మనమిద్దరమూ పుట్టుండకపోతే చెలిమికి విలువుందా

సూర్యుడూ చంద్రుడూ లేని గగనానికి వెలుగుంటుందా

మన కన్నులలో కొలువుండకపోతే చెలిమికి వెలుగుందా

గలగలమని సిరిమువ్వగా కలతెరుగని చిరునవ్వుగా

నా ఎదలయలే తన మధురిమలై పాడాలి నీ స్నేహం


కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట

రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం


వివరిస్తున్నది అద్దం మన అనుబంధానికి అర్థం

నువ్వు నాలాగా నేన్నీలాగా కనిపించడమే సత్యం

నువ్వు చూసే ప్రతి స్వప్నం నా రాతిరి దారికి దీపం

నీ కల నిజమై కనిపించనదే నిదరించనురా నేస్తం

గెలుపును తరిమే ఆటగా నిలవని పరుగులు తీయగా

మన ప్రాణాలే తన పాదలై సాగాలి ఈ స్నేహం


కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట

రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం

రూపు రేఖలు వేరట ఊపిరొకటే చాలట

ఆ వరాన్నే స్నేహమంటున్నాం మనం

కంటిపాపని కాపు కాసే జంట రెప్పల కాపలాగా

నిండు చెలిమికి నువ్వూ నేను నీడనివ్వాలి

స్నేహమంటే రూపులేని ఊహకాదని లోకమంతా

నిన్నూ నన్నూ చూడగానే నమ్మితీరాలి


7, జూన్ 2021, సోమవారం

Nee Sneham : Veyi Kannulatho Song Lyrics (వేయి కన్నులతో వేచిచూస్తున్నా)

 

చిత్రం: నీ స్నేహం

సంగీతం: R.P.పట్నాయక్

గానం:  R.P.పట్నాయక్



వేయి కన్నులతో వేచిచూస్తున్నా తెరచాటు దాటి చేరదా నీ స్నేహం కోటి ఆశలతో కోరుకుంటున్నా కరుణించి ఆదరించదా నీ స్నేహం ప్రాణమే నీకూ కానుకంటున్నా మన్నించి అందుకోవా నేస్తమా వేయి కన్నులతో వేచిచూస్తున్నా తెరచాటు దాటి చేరదా నీ స్నేహం నీ చెలిమే ఊపిరిలా బతికిస్తున్నది నన్ను నీ తలపే దీపంలా నడిపిస్తున్నది నన్ను ఎంత చెంత చేరినా సొంతమవని బంధమా ఎంతగా తపించినా అందనన్న పంతమా ఎంత ఆశ ఉన్నా నిన్ను పిలిచేదెలాగమ్మా అందాల ఆకాశమా వేయి కన్నులతో వేచి చూస్తున్నా తెర చాటు దాటి చేరదా నీ స్నేహం కోటి ఆశలతో కోరుకుంటున్నా కరుణించి ఆదరించదా నీ స్నేహం ప్రాణమే నీకు కానుకంటున్నా మన్నించి అందుకోవా నేస్తమా ఎప్పటికీ నా మదిలో కొలువున్నది నువ్వైనా చెప్పుకునే వీలుందా ఆ సంగతి ఎపుడైనా రెప్పదాటి రాననె స్వప్నమేమి కానని ఒప్పుకుంటే నేరమా తప్పుకుంటే న్యాయమా ఒక్కసారి మ్మ్.. ఒక్కసారి ల ల ల ఒక్కసారి అయినా చెయ్యి అందించి ఈ వింత దూరాన్ని కరిగించుమా వేయి కన్నులతో వేచి చూస్తున్నా తెర చాటు దాటి చేరదా నీ స్నేహం ప్రతి నిమిషం నీ ఎదుటే నిజమై తిరుగుతూ లేనా నీ హృదయం ఆ నిజమే నమ్మను అంటూ ఉన్నా వీడిపోని నీడలా వెంట ఉంది నేననీ చూడలేని నిన్నెలా కలుసుకోను చెప్పుమా ఎన్ని జన్మలైనా పోల్చుకోవేమో వెదికేది నీలోని నన్నేనని వెయ్యి కన్నులతో వేచి చూస్తున్నా తెర చాటు దాటి చేరదా నీ స్నేహం కోటి ఆశలతో కోరుకుంటున్నా కరుణించి ఆదరించదా నీ స్నేహం ప్రాణమే నీకు కానుకంటున్నా మన్నించి అందుకోవా నేస్తమా