చిత్రం : సంతోషం (2002)
సంగీతం : ఆర్.పీ.పట్నాయక్
సాహిత్యం : కుల శేఖర్
గానం: ఉష, రాజేష్
నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస నువ్వేలే నాలోకమని అన్నది నా ప్రతి ఆశ నీ నవ్వులో శృతి కలిపి పాడగ నీ నీడలో అణువణువు ఆడగ అనురాగం పలికింది సంతోషం స్వరాలుగ నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస నువ్వేలే నాలోకమని అన్నది నా ప్రతి ఆశ నువ్వు నా వెంట ఉంటే అడుగడుగున నడుపుతుంటే ఎదురయే నా ప్రతి కల నిజమల్లె కనిపించదా నిన్నిలా చూస్తు ఉంటే మైమరపు నన్నల్లుతుంటే కనపడే నిజమే ఇలా కలలాగ అనిపించదా వరాలన్ని సూటిగ ఇలా నన్ను చేరగా సుదూరాల తారక సమీపాన వాలగా లేనేలేదు ఇంకే కోరికా నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస నువ్వేలే నాలోకమని అన్నది నా ప్రతి ఆశ ఆగిపోవాలి కాలం మన సొంతమై ఎల్లకాలం నిన్నగ సన సన్నగ చేజారిపోనీయకా చూడు నా ఇంద్రజాలం వెనుతిరిగి వస్తుంది కాలం రేపుగ మన పాపగ పుడుతుంది సరికొత్తగా నీవు నాకు తోడుగా నేను నీకు నీడగా ప్రతి రేయి తీయగా పిలుస్తోంది హాయిగా ఇలా ఉండిపోతే చాలుగా నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస నువ్వేలే నాలోకమని అన్నది నా ప్రతి ఆశ నీ నవ్వులో శృతి కలిపి పాడగ నీ నీడలో అణువణువు ఆడగ అనురాగం పలికింది సంతోషం స్వరాలుగ నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస నువ్వేలే నాలోకమని అన్నది నా ప్రతి ఆశ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి