చిత్రం : సంతోషం (2002)
సంగీతం : ఆర్.పీ.పట్నాయక్
సాహిత్యం : కుల శేఖర్
గానం: ఉష
నే తొలిసారిగా కలగన్నది నిన్నేకదా
నాకళ్లెదురుగా నిలుచున్నదీ నువ్వేకదా
స్వప్నమా నువ్వు సత్యమా తేల్చి చెప్పవేం ప్రియతమా
మౌనమో మధురగానమో తనది అడగవేం హృదయమా
ఇంతలో చేరువై అంతలో దూరమై అందవా...... స్నేహమా
నే తొలిసారిగా కలగన్నది నిన్నేకదా
నా కళ్లెదురుగా నిలుచున్నదీ నువ్వేకదా
రెక్కలు తొడిగిన తలపు నువ్వే కాదా నేస్తమా
ఎక్కడవాలను చెప్పు నువ్వే సావాసమా
హద్దులు చెరిపిన చెలిమి నువ్వై నడిపే దీపమా
వద్దకు రాకని ఆపకిలా అనురాగమా....
నడకలు నేర్పిన ఆశవు కద తడబడనీయకు కదలిన కధ......
వెతికే మనసుకు మమతే...పంచుమా .....
నీ ఆటేమిటో ఏనాటికి ఆపవు కదా....
నీ బాటేమిటో ఏ జంటకీ చూపవు కదా......
నీ ఆటేమిటో ఏ నాటికి ఆపవు కదా...
నీ బాటేమిటో ఏ జంటకీ చూపవు కదా....
తెంచుకోనీవు పంచుకోనీవు ఇంత చెలగాటమా
చెప్పుకోనీవు తప్పుకోనీవు నీకు ఇది న్యాయమా
పేరులో ప్రణయమా .... తీరులో ప్రళయమా.... పంతమా... బంధమా...
నీ ఆటేమిటో ఏనాటికి ఆపవు కదా....
నీ బాటేమిటో ఏ జంటకీ చూపవు కదా......
ప్రేమా నీతో పరిచయమే ఏదో పాపమా
అమృతమనుకొని నమ్మటమే ఒక శాపమా
నీ ఒడి చేరిన ప్రతి మదికి బాధే ఫలితమా
తీయని రుచిగల కటిక విషం నువ్వేసుమా
పెదవులపై చిరునవ్వుల దగ .... కనపడనీయవు నిప్పులసెగ
నీటికి ఆరని మంటల రూపమా
నీ ఆటేమిటో ఏ నాటికి ఆపవు కదా...
నీ బాటేమిటో ఏ జంటకీ చూపవు కదా....
నీ ఆటేమిటో ఏనాటికి ఆపవు కదా....
నీ బాటేమిటో ఏ జంటకీ చూపవు కదా.....