12, నవంబర్ 2022, శనివారం

Seethamma Vakitlo Sirimalle Chettu (SVSC) : Meghaallo Song Lyrics (మేఘాల్లొ సన్నాయి)

చిత్రం: సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు(2013 )

సంగీతం: మిక్కీ జే మేయర్

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: కార్తీక్ మరియు శ్రీరామచంద్ర




మేఘాల్లొ సన్నాయి రాగం మొగింది మేలాలు తాలాలు వినరండి సిరికీ శ్రీహరికీ కళ్యాణం కానుంది శ్రీరస్తు సుభమస్తు అనరండి అచ్చ తెలుగింట్లొ పెళ్ళికి అర్ధం చెపుతారంటు మెచ్చదగు ముచ్చట ఇదె అని సాక్ష్యం చెబుతామంటు జనులంతా జై కొట్టేల జరిపిస్తామండి అందాల కుందనపు బొమ్మవని జత చేరుకున్న ఆ చందురుని వందేల్ల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటె ఓ  చరణం 1: ఇంతవరకెన్నొ చూసాం అనుకుంటె సరిపోదుగ ఎంత బరువంటె మోసె దాక తెలియదుగా ఎంతమందున్నాంలె అనిపించె బింకం చాటుగ కాస్తైన కంగారు ఉంటుందిగా నీకైతె సహజం తీయని బరువై సొగసిచ్చె బిడియం పనులెన్నొ పెట్టి మా తలలే వంచిందే ఈ సమయం మగల్లామైనా ఏం చెస్తాం సంతొషంగా మొస్తాం ఘన విజయం పొందాకె తీరిగ్గా గర్విస్తాం అందాల కుందనపు బొమ్మవని జత చేరుకున్న ఆ చందురుని వందేల్ల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటె ఓ రమని చరణం 2: రామ చిలకలతొ చెప్పి రాయించామె పత్రిక రాజ హంసలతొ పంపి ఆహ్వానించాంగ కుదురుగా నిమిషం కూడా నిలబడలేమె బొత్తిగ ఏ మాత్రం ఏ చోట రాజి పడలేక చుట్టాలందరికి అనందంతొ కల్లు చెమర్చెలా గిట్టని వాల్లయినా ఆశ్చర్యంతొ కనులను విచ్చేల కలల్లొనైనా కన్నామ కథలైన విన్నామ  ఈ వైభోగం అపురూపం అనుకుంటారమ్మా అందాల కుందనపు బొమ్మవని జత చేరుకున్న ఆ చందురుని వందేల్ల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటె ఓ రమని రమని

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి