16, డిసెంబర్ 2023, శనివారం

Aaha : Manasaina Na Priya Song Lyrics (మనసైన నా ప్రియా...)

చిత్రం: ఆహా(1998)

రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: శ్రీనివాస్

సంగీతం: వందేమాతరం శ్రీనివాస్



మనసైన నా ప్రియా... కలిగేన నీ దయా... కలలతో... కళలతో... కొత్తగా కవినయా... మనసైన నా ప్రియా... కలిగేన నీ దయా... కలలతో... కళలతో... కొత్తగా కవినయా... మనసైన నా ప్రియా... ...... ఉదయించిందమ్మా... హృదయంలో ప్రేమ... ఎదురయ్యిందమ్మా... సుధలున్న సీమ... నీ నవ్వుల్లో తొలిపొద్దే చూసుంటా... కాకుంటే లోకం రోజులా లేదే... నా చుట్టూ నిన్నా ఇంతందం లేదే... ప్రతివారి పెదవులపైన పకపక వీణ ఇదివరకెపుడూ విన్నట్టే లేదే... మనసైన నా ప్రియా... కలిగేన నీ దయా... కలలతో... కళలతో... కొత్తగా కవినయా... మనసైన నా ప్రియా... ...... పొరపాటున నువ్వు పరిచయం అవకుంటే... బ్రతుకంటే అర్థం తెలిసేదే కాదే... నడిరేయల్లే రాయల్లే నిలిచేదో... అనుకుందామన్న ఎదోలా వుందే... రేపంటూ సున్నా నీతో నడవందే... మనమింకా పుట్టకముందే ఇద్దరి ప్రాణం ఒక్కటి చేసినా ముడిపడివుంటుందే... మనసైన నా ప్రియా... కలిగేన నీ దయా... కలలతో... కళలతో... కొత్తగా కవినయా... మనసైన నా ప్రియా... కలిగేన నీ దయా... కలలతో... కళలతో... కొత్తగా కవినయా... మనసైన నా ప్రియా...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి