చిత్రం: ఆజాద్ (2000)
సాహిత్యం: వేటూరి
సంగీతం: మణి శర్మ
గానం: సుఖ్వీందర్ సింగ్, , కె.యస్.చిత్ర
హాయ్ హాయ్ నాయకా...అత్తమ్మ కొడకా... నా సొత్తు యావత్తు నీదింక సై సై బాలిక అందాల చిలక నీ సోకు నాజూకు నాదింక చీర దులిపేసే చూపులకు జోహారు సిగ్గు చిదిమేసే కోరికలే నా జోరు ఒహోహోహో ........ హాయ్ హాయ్ నాయకా...అత్తమ్మ కొడకా... నా సొత్తు యావత్తు నీదింక సై సై బాలిక అందాల చిలక నీ సోకు నాజూకు నాదింక ఎక్కడిదో ఈ వయసు చెలీ దక్కెనులే నీ దినుసు తొక్కిడిలో నా సొగసు యమా ఉస్కులడి నా మనసు మంచాలలో మల్లె కంచాలలో వండి వార్చాను వయ్యారి నా తళుకులు చెక్కిళ్ళలో వాటి పక్కిళ్ళలో దిద్దుకున్నాను ముద్దులతో నా తెలుగులు గుట్టు రైక ముడి పట్టు కదా న పరువు అది ఫట్టుమనే బీటు కదా నా దరువు హాయ్ హాయ్ నాయకా...అత్తమ్మ కొడకా... నా సొత్తు యావత్తు నీదింక సై సై బాలిక అందాల చిలక నీ సోకు నాజూకు నాదింక ఒత్తిడిలో ఒక్క క్షణం చిత్తడిలో అగ్ని కణం అందుకనే ఆడతనం ముద్దులకే మూలధనం ఈడన్నది పుంజు కోడైనది దాని కొక్కొరొకో నీకొరకేలే తెలుసుకో తోడన్నది కొత్త జోడైనది దాని జోరు మరి ఆగదులే ఈ వయసులో కన్నె గువ్వ చెలి దువ్వి మరీ పోగొడతా ఉన్న కోడె గిలి తవ్వి మరి రాబడతా హాయ్ హాయ్ నాయకా...అత్తమ్మ కొడకా... నా సొత్తు యావత్తు నీదింక సై సై బాలిక అందాల చిలక నీ సోకు నాజూకు నాదింక చీర దులిపేసే చూపులకు జోహారు సిగ్గు చిదిమేసే కోరికలే నా జోరు ఒహోహోహో ........ ఒహోహోహో
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి