చిత్రం: భలే మావయ్య (1994)
రచన: వేటూరి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర
సంగీతం: రాజ్ - కోటి
ఆడే పాడే వయస్సు మాది అద్దం లాంటి మనస్సు మాది ఆకాశం మా హద్దు ఆదర్శాలే ముద్దు అంతా ఒకటై ఉంటే అడ్డే మాకిక లేదు నదురు బెదురు ఎదురే లేదంతే నమస్తే ఈ ప్రేమకు నమస్తే నమస్తే ఈ ప్రేమకు నమస్తే ఆడే పాడే వయస్సు మాది అద్దం లాంటి మనస్సు మాది చరణం 1: ఒక్కటైతే చాలురా ఓటమింక లేదురా ఏకధాటి యాత్రలో ఎదురు లేదురా బ్రహ్మరాత మార్చరా రుద్రుడల్లె మారరా నింగిలోన సూర్యుడు నిద్రపోడురా నలుగురు కలిసిన నవ్వే బలం నడుములు వంచిన శ్రమే ఫలం నలుగురు కలిసిన నవ్వే బలం నడుములు వంచిన శ్రమే ఫలం జనమూ మనమూ కలిసే జగమంటే నమస్తే ఈ ప్రేమకు నమస్తే నమస్తే ఈ ప్రేమకు నమస్తే ఆడే పాడే వయస్సు మాది అద్దం లాంటి మనస్సు మాది చరణం 2: నమస్తే ఈ ప్రేమకు నమస్తే నమస్తే ఈ ప్రేమకు నమస్తే ఋతువులెన్ని మారినా మతులు మారనీకురా మనసు కన్న లేదురా కలిమి సోదరా నీకు దిక్కు నేనురా నాకు దివ్వె నీవురా నీవు తోడు నేను నీడై సాగుదామురా చిరిగె నిరాశల నీ రాతిరి వెలిగె ఉగాదిగ నీ ఊపిరి చిరిగె నిరాశల నీ రాతిరి వెలిగె ఉగాదిగ నీ ఊపిరి మనసూ మమత కలిసే మనిషంటే నమస్తే ఈ ప్రేమకు నమస్తే నమస్తే ఈ ప్రేమకు నమస్తే ఆడే పాడే వయస్సు మాది అద్దం లాంటి మనస్సు మాది ఆకాశం మా హద్దు ఆదర్శాలే ముద్దు అంతా ఒకటై ఉంటే అడ్డే మాకిక లేదు నదురు బెదురు ఎదురే లేదంతే నమస్తే ఈ ప్రేమకు నమస్తే నమస్తే ఈ ప్రేమకు నమస్తే
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి