చిత్రం: భలే మావయ్య (1994)
రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: కె.యస్.చిత్ర
సంగీతం: రాజ్ - కోటి
కుహు కుహు కోకిలమ్మా గుండె కోయకే పూలకొమ్మ నీడలోన కట్టెలమ్మకే అనురాగాలన్నీ కలలాయేనా అభిమానాలన్నీ కథలాయేనా కుహు కుహు కోకిలమ్మా గుండె కోయకే పూలకొమ్మ నీడలోన కట్టెలమ్మకే చరణం 1: నిన్నటి తోడే వెన్నెల నీడై జ్ఞాపకమైపోయెనే మూయని కన్నే రేయిగ మారే చీకటి నా పేరులే మదిలో కదిలి మనసే అడిగి బదులే తోచని బరువైపోతివి నా కొన ఊపిరిలో కుహు కుహు కోకిలమ్మా గుండె కోయకే పూలకొమ్మ నీడలోన కట్టెలమ్మకే చరణం 2: తియ్యని స్నేహం తీరని దాహం జీవితమే చేదులే ఇచ్చిన మనసు పెంచిన వలపు ఎన్నటికీ రావులే క్షణమే యుగమై బ్రతుకే సగమై పెదవే దోచని పదమైపోతివి జీవన లాహిరిలో కుహు కుహు కోకిలమ్మా గుండె కోయకే పూలకొమ్మ నీడలోన కట్టెలమ్మకే అనురాగాలన్నీ కలయేలానా అభిమానాలన్నీ కథలాయేనా కుహు కుహు కోకిలమ్మా గుండె కోయకే పూలకొమ్మ నీడలోన కట్టెలమ్మకే
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి