2, డిసెంబర్ 2023, శనివారం

Manasichi Choodu : Bodi Chaduvulu wasteu Song Lyrics (బోడి చదువులు వేస్టు )

చిత్రం: మనసిచ్చి చూడు (1998)

రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం

సంగీతం: మణి శర్మ



బోడి చదువులు వేస్టు నీ బుర్రంత భోంచేస్తు ఆడి చూడు క్రికెట్టు టెండూల్కర్ అయ్యేటట్టు బోడి చదువులు వేస్టు నీ బుర్రంత భోంచేస్తు ఆడి చూడు క్రికెట్టు టెండూల్కర్ అయ్యేటట్టు ఒక్క పోజుకొట్టూ లక్షలు వచ్చి పడేటట్టు ఆడిడాస్ బూట్లూ తొడగవ నీకు ఆరు కోట్లు ఎంత చదివితే సంపాదిస్తవు అంత పెద్ద అంతస్తు ఓరి ఇన్నొసెంటు స్టూడెంటు బోడి చదువులు వేస్టు నీ బుర్రంత భోంచేస్తు ఆడి చూడు క్రికెట్టు టెండూల్కర్ అయ్యేటట్టు చిరుపుంజిలోన చినుకెంతైన తడుస్తుంద నీ జుట్టు థారెడారి గోలెందుకులేర గోదారి ఒడ్డునుంటూ వీరప్పన్ కొట్టేసుంటాడు అశోకుడెప్పుడొ నాటిన చెట్లు పాత డేట్లు బట్టీ వేస్తు అసలేంటి కుస్తీ పాట్లూ ఐ క్యు అంటే అర్ధం తెలుసా అతి తెలివికి తొలి మెట్టు ఆడె పాడె ఈడుని దానికి పెట్టకు తాకట్టూ పనికిరాని చెత్తంత నింపకు మెదడు చెదలు పట్టు ఓరి ఇన్నొసెంటు స్టూడెంటు బోడి చదువులు వేస్టు నీ బుర్రంత భోంచేస్తు ఆడి చూడు క్రికెట్టు టెండూల్కర్ అయ్యేటట్టు ఇదిగో లీకు వీరులకు ముందే తెలుసు క్వశ్చన్ పేపరు గుట్టూ లోక జ్ఞానం కలిగిన వాడె కోచింగ్ సెంటరు పెట్టు.. బాబూ మార్కుల కోసం ఏడవలేదుర ఎదిగిన ఏ సైంటిస్టూ గుర్తుపట్టరా ఏ రంగంలో ఉందో నీ ఇంట్రస్టూ నీకూడా ఉండే ఉంటుంది ఏదో ఒక టాలెంటు నీకు నువ్వు బాసవ్వాలంటే దాని బయట పెట్టు రేసు హార్సువై లైఫ్ ను గెలిచే పరుగు మొదలుపెట్టు ఓరి ఇన్నొసెంటు స్టూడెంటు బోడి చదువులు వేస్టు నీ బుర్రంత భోంచేస్తు ఆడి చూడు క్రికెట్టు టెండూల్కర్ అయ్యేటట్టు రెండో ఎక్కం రాకపోయిన నీకేమిట్ర లోటు . కాలికులేటరు చేపట్టు డోన్ట్ వర్రీస్ బిల్లు కడితే నీ బెడ్ రూమ్ లో వేస్తాడు బాసింపట్టు సాక్షాత్తు బిల్ గేట్సు పిచ్చోడెవడొ జుట్టును పీక్కొని ఎన్నో కనిపెట్టు పైసా ఉంటే అదే నీకు అవి అన్నీ కొనిపెట్టు చదువు సంధ్య వదిలిపెట్టి సన్నాసివి కమ్మంటు సలహా ఇస్తున్నాననుకుంటే అదే రాంగు రూటు ""బతుకు బాటలో ముందుకు నడపని బరువు మోయవద్దు"" ఓరి ఇన్నొసెంటు స్టూడెంటు బోడి చదువులు వేస్టు నీ బుర్రంత భోంచేస్తు ఆడి చూడు క్రికెట్టు టెండూల్కర్ అయ్యేటట్టు






కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి