2, డిసెంబర్ 2023, శనివారం

Manasichi Choodu : Nalo Ededo Aypotunnade Song Lyrics (నాలో ఏదేదో అయిపోతున్నదే)

చిత్రం: మనసిచ్చి చూడు (1998)

రచన:

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , సుజాత 

సంగీతం: మణి శర్మ



నాలో ఏదేదో అయిపోతున్నదే అంతే ఈ ప్రేమ వరస దాని అంతే చూడాలి వయసా నీ తోడు కోరింది నా ఊపిరి.. అంతే ఈ ప్రేమ వరసా దాని అంతే చూడాలి వయసా ఈవేళ ఈ సూర్యోదయం ఇన్నాళ్ల లాగ లేదు కదా నీలోన ఈ ప్రేమోత్సవం ఈ రోజే పుట్టినట్టు ఉందా లేదా నాలో ఏదేదో అయిపోతున్నదే అంతే ఈ ప్రేమ వరస దాని అంతే చూడాలి వయసా భాష మొత్తమూ మాయమైనదా గుండె మాట గొంతు దాటి రాదే అంతే ఈ ప్రేమ వరస దాని అంతే చూడాలి వయసా శ్వాస మాత్రమూ గేయమైనదా హాయి పాటలెన్నో మీటుతోందే అంతే ఈ ప్రేమ వరస దాని అంతే చూడాలి వయసా నీలో ఏదో కొత్త కోణం చూశా నువ్వు నువ్వేనా కాళిదాసా నీవే కదా నిండు ప్రాణం పోసి దీన్ని పెంచావు కన్నె హంస ఒక్క మాటే అని కోటి భావాలని అందచెయ్యాలని కొత్త పాఠం ఇదే తెలుసా నాలో ఏదేదో అయిపోతున్నదే అంతే ఈ ప్రేమ వరస దాని అంతే చూడాలి వయసా కన్ను కొద్దిగా చిన్నదైనదా నిన్ను తప్ప ఏమీ చూడలేదే అంతే ఈ ప్రేమ వరస దాని అంతే చూడాలి వయసా కొన్ని ఏళ్లుగా ముందుకెళ్లక కాలమంతా ఆగిపోయే ముందే అంతే ఈ ప్రేమ వరస దాని అంతే చూడాలి వయసా ఏతా వాతా దీని వాటం చూస్తే తీయగా ఉన్న కత్తి కోత ఇంటా బయటా మొగమాటం పెట్టే తప్పుకోలేని వింత వేటా మంచు మంటై ఇలా అంటుకుంటే ఎలా పంచుకుంటే తనే తగ్గుతుందో ఏమో బహుశా నాలో ఏదేదో అయిపోతున్నదే అంతే ఈ ప్రేమ వరస దాని అంతే చూడాలి వయసా నీ తోడు కోరింది నా ఊపిరి.. అంతే ఈ ప్రేమ వరసా దాని అంతే చూడాలి వయసా ఈవేళ ఈ సూర్యోదయం ఇన్నాళ్ల లాగ లేదు కాదా నీలోన ఈ ప్రేమోత్సవం ఈ రోజే పుట్టినట్టు ఉందా లేదా నాలో ఏదేదో అయిపోతున్నది అంతే ఈ ప్రేమ వరస దాని అంతే చూడాలి వయసా అంతే ఈ ప్రేమ వరస దాని అంతే చూడాలి వయసా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి