చిత్రం: మనసిచ్చి చూడు (1998)
రచన: చంద్రబోస్
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం
సంగీతం: మణి శర్మ
పల్లవి :
భలేగా తేల్చుకోమని
నాకు ఓ పని అప్పగించిందీ
అలాగే లేమ్మా అజంత భామ్మా
అనేసి దూసుకొచ్చేయ్
నన్ను చూసి దారి ఇవ్వండి
తెల్లని కాకిని తెమ్మన్నా చిటికెలో తెస్తా
తనూ బంగారు జింకని ఇమ్మనా క్షణమున ఇస్తా
వయసే ఇరవై పరుగే ఎనభయ్
చూపే చురుకై చూసే చెలికై
ఏరికోరి ఎండమూరి నవలందిస్తా ...
గులాబీ రెమ్మ చలాకీ బొమ్మ
భలేగా తేల్చుకోమని
నాకు ఓ పని అప్పగించిందీ
చరణం 1 :
అతడు ఆమె సైన్యం చదివితే జతకు చేరునేమో
మంచు పూల వర్షం చదివితే మనసు పంచునేమో
తులసి నవల శాంతము చదివితే కలిసి పోవునేమో
వెన్నెల్లో ఆడపిల్ల ఈమెనేమో
చెంగల్వ పూలదండ వేస్తుందేమో
నల్ల అంచులో తెల్ల చీరలో
కలికి చిలిపి చెలిమి చిలికునేమో
గులాబీ రెమ్మ చలాకీ బొమ్మ
భలేగా తేల్చుకోమని
నాకు ఓ పని అప్పగించిందీ
అలాగే లేమ్మా అజంత భామ్మా
అనేసి దూసుకొచ్చేయ్
నన్ను చూసి దారి ఇవ్వండి
hurray ..right right right
చరణం 2 :
పుస్తకాలు అన్నీ ప్రేమకు పూనకాలు తేగా
కవర్ పేజీ లన్ని కంటికి రంగులద్ది పొగా
ముందు మాటలన్నీ సూటిగా ముందుకెళ్ళమనగా
బంధంగా మారుతోంది గ్రంధాలయమే
సరదాగా కోరుకుంది ఇద్దరి ప్రేమే
ప్రసాదించవే పసిడి గుండెల్లో
శాశ్వతాంగ సభ్యుడయ్యే వరమే
హే వారెవా హయ్యా
గులాబీ రెమ్మ చలాకీ బొమ్మ
భలేగా తేల్చుకోమని
నాకు ఓ పని అప్పగించిందీ
అలాగే లేమ్మా అజంత భామ్మా
అనేసి దూసుకొచ్చేయ్
నన్ను చూసి దారి ఇవ్వండి
తెల్లని కాకిని తెమ్మన్నా చిటికెలో తెస్తా
తనూ బంగారు జింకని ఇమ్మనా క్షణమున ఇస్తా
వయసే ఇరవై పరుగే ఎనభయ్
చూపే చురుకై చూసే చెలికై
ఏరికోరి ఎండమూరి నవలందిస్తా ...