చిత్రం: నాలో ఉన్న ప్రేమ (2000)
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
సంగీతం: కోటి
గానం: మనో , కె.యస్.చిత్ర
ఓ నా ప్రియతమా అనరాదే అప్పుడే ఓ నా ప్రియతమా అనరాదే అప్పుడే అంత క్షేమమా అని అంటే చాలదే మనసును తాకి చనువుగా పిలిచే నీ లేఖను చదివిన మనకిదివరకే పరిచయమేదో ఉందని అనిపించినా ఓహోవు ఓహోవు ఓహోవు ఓహో ఓహోవు ఓహోవు ఓహోవు ఓహో ఓ నా ప్రియతమా అనరాదే అప్పుడే అంత క్షేమమా అని అంటే చాలదే ఇన్ని సార్లు చదువుకొని మళ్ళీ మళ్ళీ తలచుకొని గుండె ఎంత మురిసినదో చెప్పలేను మరి ఎంతసేపు మదనపడి మాట మాట తడుముకుని పూర్తి కాని ఊహలతో నిన్ను చేరినది పైకి రాని గుండె సవ్వడి ఎలాగో నీకు విన్నవించుకున్నది ఆగని ఆశల సాగర కెరటమిది ఓ నా ప్రియతమా అనరాదే అప్పుడే అంత క్షేమమా అని అంటే చాలదే తేనెలోని మధురిమలు వాన లోని సరిగమలు పూలలోని గుమగుమలు చేర్చి రాసినది వేదికైన హృదయముపై వేడుకైన మధురిమవై ఆలపించు రాధికల పలికే అష్ట పడి ప్రాణమంత పాట అయినది నీకోసం సాగుతున్న పయనమే ఇది ఆ ప్రియా రాగమే శ్వాసగా మారినది ఓ నా ప్రియతమా అనరాదే అప్పుడే అంత క్షేమమా అని అంటే చాలదే మనసును తాకి చనువుగా పిలిచే నీ లేఖను చదివిన మనకిదివరకే పరిచయమేదో ఉందని అనిపించినా ఓహోవు ఓహోవు ఓహోవు ఓహో ఓహోవు ఓహోవు ఓహోవు ఓహో ఓహోవు ఓహోవు ఓహోవు ఓహో
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి