చిత్రం: నాలో ఉన్న ప్రేమ (2000)
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
సంగీతం: కోటి
గానం: హరి హరన్, సుజాత
ఎన్నో ఎన్నో చెప్పాలనుకున్నా తెలుసా అలలై ఎగసే ప్రియ భావాలు తెలిపేదెలా హృదయంలో నిండిన నువ్వే ఎదురయితే మాటలు రావే ఈ మౌనం ఇద్దరి మధ్య ఇంకా ఎన్నాళ్ళు
ఎన్నో ఎన్నో చెప్పాలనుకున్నా తెలుసా అలలై ఎగసే ప్రియ భావాలు తెలిపేదెలా
నిను చేరే తొందరలో వద్దన్నా వినదు కదా పడిపోదా ఎగిరే కన్నె ఎదా... పదిలంగా అందుకొని గుండెలలో దాచుకునే ప్రియ నేస్తం నేనున్నాను కదా ... అది నిజమైన అనలేదు నాతో అసలెపుడైనా అడిగావ నన్ను అడగాలని అనుకుంటూ ఉన్నా ఆ... అడుగెందుకు ముందుకు పడదో ఏమో పెదవుల్లొ అల్లరిగా తుళ్ళిపడే మువ్వలయే చిరునవ్వుల సందడి నీతలపే... ఓ నడిరాతిరి నిద్దురలో నాకలలే నడిపించే సిరివెన్నెల స్నేహం నీ పిలుపే... తలపులలోనే నువు దాగిపోకు మెలకువ రాని కలలెంత సేపు నీ మనసుని చదవాలనుకున్నా ఆ... వినకూడని బదులిస్తుందో ఏమొ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి