చిత్రం: పరదేశి (1998)
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి
గానం: ఎం. ఎం. కీరవాణి , సుజాత
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
జగతి సిగలో జాబిలమ్మకు వందనం వందనం... మమతలెరిగిన మాతృభూమికి మంగళం మాతరం.. మగువ శిరసున మణులు పొదిగెను హిమగిరి కలికి పదములు కడలి కడిగిన కళ ఇదీ ఐ లవ్ ఇండియా ఐ లవ్ ఇండియా ఐ లవ్ ఇండియా ఐ లవ్ ఇండియా చరణం 1: గంగ యమునలు సంగమించిన గానమో సనిసగస మపపదప నిసరిమపా కూచిపూడికి కులుకు నేర్పిన నాట్యమో పమరిస రిమపని సరినిసదపా అజంతాల ఖజురహోల సంపదలతో సొంపులొలికే భారతీ జయహో..ఓ ... మంగళం ... మాతరం ఐ లవ్ ఇండియా ఐ లవ్ ఇండియా ఐ లవ్ ఇండియా ఐ లవ్ ఇండియా జగతి సిగలో జాబిలమ్మకు వందనం వందనం...వందనం చరణం 2: మపససాసస దానిపా గామపా దానిపా సససరిసరిపగా సససరినీపగా తాజ్ మహలే ప్రణయ జీవుల పావురం తన్నానె తానెనాన తన్నానె తానెనాన కృష్ణవేణీ శిల్పరమణీ నర్తనం తన్నానెనా తననానేనా వివిధ జాతుల... వివిధ మతముల.. ఎదలు మీటిన ఏకతాళపు భారతీ జయహో..ఓ ... మంగళం ... మాతరం ఐ లవ్ ఇండియా ఐ లవ్ ఇండియా ఐ లవ్ ఇండియా ఐ లవ్ ఇండియా జగతి సిగలో జాబిలమ్మకు వందనం వందనం... మమతలెరిగిన మాతృభూమికి మంగళం మాతరం.. వందే మాతరం....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి