చిత్రం: పరదేశి (1998)
సాహిత్యం: చంద్రబోస్
గానం: ఉన్ని కృష్ణన్, కె.యస్.చిత్ర
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
పల్లవి: తెలుగు ఇంటి పెరటిలోన విరిసే మందారమా... చిగురు మావి గుబురులోని కుహు కుహూల రాగమా... I am feeling feeling feeling that i am falling in love అహ ప్రేమా ప్రేమా ప్రేమా అంటూ.. i want to live ఈ ఊరి గాలి మంచి కబురు తెచ్చిందీ కోరుకోని కాలమేమొ కలిసొచ్చింది నయగారా దారుల్లో ఉరికే జలపాతమా... న్యూజెర్సీ తోటల్లో అల్లుకున్న శాంతమా... I am feeling feeling feeling that i am falling in love అహ ప్రేమా ప్రేమా ప్రేమా అంటూ... i want to live ఈ చిన్ని మాట నాకు భలే నచ్చింది ఇంతవరకు లేని హాయి తెలిసొచ్చింది చరణం 1: జూలియట్టు రోమియోల జంటలీల మనదీ నలదమయంతిలోని పంతమే ఇదీ డ్రీం ల్యాండు నేలమీద ప్రేమ కాండ మనది యదుకుల వీధిలోని ప్రణయమే ఇదీ దేశం మారినా ప్రేమ రసం ఒక్కటే కాలం మారినా కన్నెతనం ఒక్కటే చనువే పెరిగినా తనువే మరిగినా సరిగంగ స్నానాల వణుకు ఒక్కటే వాల్ట్ డిస్నీ ఊహల్లో దాగిన సౌందర్యమా పడమరమ్మ నుదుటిపైన మెరిసే సింధూరమా I am feeling feeling feeling that i am falling in love అహ ప్రేమా ప్రేమా ప్రేమా అంటూ i want to live చరణం 2: ఆంధ్ర పెదవి ఆంగ్ల పెదవి హత్తుకున్న నిమిషం మధువుల ముంచు ఫ్రెంచు ముద్దులే సుమా సీమరాణి రామరాజు దగ్గరైన తరుణం మనువుకు గ్రీను కార్డు సిధ్ధమే సుమా అతిధిగ వచ్చినా అమృతమే ఇవ్వనా హృదయం అర్పణ ఈ క్షణమే చెయ్యనా తరగని కాంక్షతో వదలని దీక్షతో వెయ్యేళ్ళు వెయ్యాలి వలపు వంతెనా విజయనగర వీధుల్లో మెరిసే రవి కిరణమా వాషింగ్ టన్ వీధుల్లో కురిసే హిమ చైత్రమా I am feeling feeling feeling that i am falling in love అహ ప్రేమా ప్రేమా ప్రేమా అంటూ i want to live ఈ చిన్న మాట నాకు భలే నచ్చింది కోరుకోని కాలమేమొ కలిసొచ్చింది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి