చిత్రం: సిరివెన్నెల (1986)
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
సంగీతం: కె.వి. మహదేవన్
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం ,పి. సుశీల
ఈ గాలి.. ఈ నేల.. ఈ ఊరు సెలయేరు.. ఈ గాలి.. ఈ నేల.. ఈ ఊరు సెలయేరు.. ననుగన్న నా వాళ్ళు ఆ...నా కళ్ళ లోగిళ్ళు ననుగన్న నా వాళ్ళు ఆ...నా కళ్ళ లోగిళ్ళు ఈ గాలి.. ఈ నేల..
చిన్నారి గొరవంక కూసేను ఆ వంక నా రాత తెలిసాక వచ్చేను నా వంక చిన్నారి గొరవంక కూసేను ఆ వంక నా రాత తెలిసాక వచ్చేను నా వంక ఎన్నాళ్ళో గడిచాక ఇన్నాళ్ళకు కలిసాక ఎన్నాళ్ళో గడిచాక ఇన్నాళ్ళకు కలిసాక ఉప్పొంగిన గుండెల కేక ఎగసేను నింగి దాకా ఉప్పొంగిన గుండెల కేక ఎగసేను నింగి దాకా ఎగసేను నింగి దాకా... ఈ గాలి.. ఈ నేల.. ఈ ఊరు సెలయేరు.. ననుగన్న నా వాళ్ళు ఆ...నా కళ్ళ లోగిళ్ళు ఈ గాలి.. ఈ నేల..
ఏనాడు ఏ శిల్పి కన్నాడో ఈ కలను ఏ ఉలితో ఈ శిలపై నిలిపాడో ఈ కళను ఏనాడు ఏ శిల్పి కన్నాడో ఈ కలను ఏ ఉలితో ఈ శిలపై నిలిపాడో ఈ కళను ఏ వలపుల తలపులతో తెలిపాడో ఈ కథను ఏ వలపుల తలపులతో తెలిపాడో ఈ కథను ఈ రాళ్ళే జవరాళ్ళై ఇట నాట్యాలాడేను ఈ రాళ్ళే జవరాళ్ళై ఇట నాట్యాలాడేను
కన్నె మూగమనసుకన్న స్వర్న స్వప్నమై తళుకుమన్న తారచిలుకు కాంతి చినికులై కన్నె మూగమనసుకన్న స్వర్న స్వప్నమై తళుకుమన్న తారచిలుకు కాంతి చినికులై గగనగళము నుండి అమర గానవాహిని గగనగళము నుండి అమర గానవాహిని జాలువారుతోంది ఇలా అమృతవర్షినీ అమృతవర్షిని ఈ స్వాతివానలో నా ఆత్మ స్నానమాడే నీ మురళిలో నా హృదయమే స్వరములుగా మారే
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి