25, డిసెంబర్ 2023, సోమవారం

Sirivennela : Merise taralade Rupam Song Lyrics (మెరిసే తారలదే రూపం)

చిత్రం: సిరివెన్నెల (1986)

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

సంగీతం: కె.వి. మహదేవన్

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం



పల్లవి :  మెరిసే తారలదే రూపం? విరిసే పూవులదే రూపం? అది నా కంటికి శూన్యం మనసున కొలువై మమతల నెలవై.. వెలసిన దేవిది ఏ రూపం నా కన్నులు చూడని రూపం.. గుడిలో దేవత ప్రతిరూపం నీ రూపం.. అపురూపం  మనసున కొలువై మమతల నెలవై.. వెలసిన దేవిది ఏ రూపం నా కన్నులు చూడని రూపం.. గుడిలో దేవత ప్రతిరూపం నీ రూపం.. అపురూపం  చరణం 1 :  ఎవరి రాకతో గళమున పాటల ఏరువాక సాగేనో ఆ వసంత మాసపు కులగొత్రాలను ఎల కోయిల అడిగేనా ఎవరి పిలుపుతో పులకరించి పురి విప్పి తనువు ఊగేనో ఆ తొలకరి మేఘపు గుణగణాలకై నెమలి వెదుకులాడేనా  నా కన్నులు చూడని రూపం.. గుడిలో దేవత ప్రతిరూపం నీ రూపం.. అపురూపం చరణం 2 : ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలా? గానం పుట్టుక గాత్రం చూడాలా? ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలా? గానం పుట్టుక గాత్రం చూడాలా? వెదురును మురళిగ మలచి ఈ వెదురును మురళిగ మలచి నాలొ జీవన నాదం పలికిన నీవే నా ప్రాణ స్పందన.. నీకే నా హృదయ నివేదన.... మనసున కొలువై మమతల నెలవై.. వెలసిన దేవిది ఏ రూపం నా కన్నులు చూడని రూపం.. గుడిలో దేవత ప్రతిరూపం నీ రూపం.. అపురూపం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి