25, డిసెంబర్ 2023, సోమవారం

Sirivennela : Prakruti Kanthaku Song Lyrics (ప్రకృతి కాంతకు ఎన్నెన్ని)

చిత్రం: సిరివెన్నెల (1986)

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

సంగీతం: కె.వి. మహదేవన్

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం




ప్రకృతి కాంతకు ఎన్నెన్ని హొయలో పదము కదిపితే ఎన్నెన్ని లయలో (2)  ఎన్నెన్ని హొయలో ఎన్నెన్ని లయలో (2) సిరివెన్నెల  ఎదపై సిరిమువ్వల సవ్వడి నీవై నర్తించగా రావేల...నిన్నే కీర్తించే వేళ ప్రకృతి కాంతకు ..... అలల పెదవులతో శిలల చెక్కిలిపై కడలి ముద్దిడు వేళ  పుడమి హృదయములో (2) ఉప్పొంగి సాగింది అనురాగము ఉప్పెనగ దూకింది ఈ రాగము ప్రకృతి కాంతకు...... కొండల బండల దారులలో తిరిగేటి సెలయేటి గుండెలలో (2) రా రా రా రమ్మని పిలిచినా కోన పిలుపు వినిపించగనే (2) ఓ  కొత్త వలపు వికసించగనే ఎన్నెన్ని హొయలో ఎన్నెన్ని లయలో ప్రక్రుతి కాంతకు.....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి