చిత్రం: స్వప్నలోకం (1999)
రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: హరిహరన్
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
ప్రేమిస్తున్న ప్రేమిస్తున్నా ప్రేమిస్తున్న ప్రేమిస్తున్నా నిన్ను చూపినందుకు వెలుగుని నువ్వు పలికినందుకు తెలుగుని నువ్వు నడిచినందుకు నేలని నువ్వు పీల్చినందుకు గాలిని... ప్రేమిస్తున్న ప్రేమిస్తున్నా ప్రేమిస్తున్న ప్రేమిస్తున్నా
సొంతం నీకే అయినా అందాన్ని ప్రేమిస్తున్నా సంతానం నీకే వచ్చినందుకు వయసును ప్రేమిస్తున్న అపురూపంగా మలచినందుకు ఆ బ్రాహ్మణి ప్రేమిస్తున్న సుకుమారంగా పెంచినందుకు కన్నోళ్లను ప్రేమిస్తున్నా నిన్ను నిదుర పుచ్చినందుకు పాన్పు ను ప్రేమిస్తున్న (2) నిన్ను మేలు కొలిపినందుకు తూర్పును ప్రేమిస్తున్నా ప్రేమిస్తున్న ప్రేమిస్తున్నా ప్రేమిస్తున్న ప్రేమిస్తున్నా
ఎదురుగా నిన్నే నిలిపినందుకు పగటిని ప్రేమిస్తున్నా కలలో నిన్నే పంపినందుకు రాత్రిని ప్రేమిస్తున్నా నీ కన్నులనే పోలినందుకు మీనాలని ప్రేమిస్తున్నా నీ కంటాన్నే కలిగినందుకు కోయిలను ప్రేమిస్తున్నా నిన్ను తెలుసుకున్నాడుకు నన్నే ప్రేమిస్తున్న(2) నిన్ను నన్ను కలిపినందుకు ప్రేమను ప్రేమిస్తున్నా ప్రేమిస్తున్న ప్రేమిస్తున్న (2)
నిన్ను చూపినందుకు వెలుగుని నువ్వు పలికినందుకు తెలుగుని నువ్వు నడిచినందుకు నేలని నువ్వు పీల్చినందుకు గాలిని... ప్రేమిస్తున్న ప్రేమిస్తున్నా ప్రేమిస్తున్న ప్రేమిస్తున్నా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి