18, డిసెంబర్ 2023, సోమవారం

Maavichiguru : Kommana Kulike Koyila Song Lyrics (కొమ్మన కులికే కోయిల)

చిత్రం: మావిచిగురు (1996)

రచన:  భువన చంద్ర

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర

సంగీతం:  ఎస్. వి. కృష్ణారెడ్డి


పల్లవి :

కొమ్మన కులికే కోయిల ఓ కమ్మని పాట పాడవే కమ్మగ నవ్వే నెచ్చెలి నీ అందెల సవ్వడి చెయ్యవే ఓ....మామా - ఓ....భామా ఎదలోయల దాగిన చిత్రమా కనుసైగలు చేసిన ఆత్రమా ఉదయాలకు నీవే ప్రాణమా కసి ముద్దులు రాసిన కావ్యమా వయారాల వీణ మీటి దోచుకున్న నేస్తమా కొమ్మన కులికే కోయిల ఓ కమ్మని పాట పాడవే తేనెలు మరిగిన తుమ్మెదా కను చూపుల గారడి చేయకే చరణం: 1

చెప్పేయ్ వా చెవిలోన ఒక మాట పువ్వులతో తుమ్మెద చెప్పేమాట నీ చిరునవ్వు సాక్షిగా తాజ్మహల్ నాదట నీ పెదవంచు సాక్షిగా షాజహాను నేనట నీ తియ్యని ప్రేమకి నా పెదవే నజరానా నీ పైటకి నేనిక బానిసనే నెరజాణ అనంతాల ఆర్త నీవై చేరుకున్న వెళ్లలో కొకలు కట్టిన కోయిల ఓ కమ్మని కౌగిలియవే తేనెలు మరిగిన తుమ్మెద కను చూపుల గారడి చేయకే చరణం: 2

పూసింది కౌగిట్లో పులకింత వెచ్చంగా పాకింది ఒళ్ళంతా పదహారేళ్ళ యవ్వనం పదిలంగా దాచిన నీ మెడలోని తాళినై నూరేళ్లు దాగన నీ చెంతకు చేరా విరహంతో పడలేక నును మెత్తని పరువం రాసింది శుభలేఖ సరగాల సాగరాన స్వాతిచినుకై సోలిపో కొమ్మన కులికే కోయిల ఓ కమ్మని పాట పాడవే తేనెలు మరిగిన తుమ్మెదా నీ అల్లరి పనులిక ఆపవే ఓ....భామ - ఓ....మామ ఉదయాలకు నీవే ప్రాణమా కసి ముద్దులు రాసిన కావ్యమా ఎదలోయల దాగిన చిత్రమా కనుసైగలు చేసిన ఆత్రమా వయారాల వీణ నీవై దోచుకున్న అందమా కొమ్మన కులికే కోయిల ఓ కమ్మని పాట పాడవే కమ్మగ నవ్వే నెచ్చెలి నీ అందెల సవ్వడి చెయ్యవే



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి