23, డిసెంబర్ 2023, శనివారం

Top Hero : Okkasaari Nandamuri Song Lyrics (ఒక్కసారి ఒక్కసారి వద్దకొస్తా)

చిత్రం: టాప్ హీరో(1994)

రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర

సంగీతం: ఎస్. వి. కృష్ణారెడ్డి



పల్లవి: ఒక్కసారి ఒక్కసారి వద్దకొస్తా వద్దకొచ్చి ముద్దులిచ్చి ఉద్ధరిస్తా ఒక్కసారి ఒక్కసారి పక్కకొస్తా పక్కకొచ్చి చిక్కనైన చెక్కిలిస్తా అరె తకజుం తకజుం తకజుం తకజుం తకధిమి నడకల నడుములో నలిగిన సొగసులు తడుముతా పెదవి మదుపు పెడతా హోయ్ వలపు తలుపు తడతా హోయ్ ఒక్కసారి ఒక్కసారి వద్దకొస్తా వద్దకొచ్చి ముద్దులిచ్చి ఉద్ధరిస్తా ఒక్కసారి ఒక్కసారి పక్కకొస్తా పక్కకొచ్చి చిక్కనైన చెక్కిలిస్తా చరణం: 1 సన్నజాజుల చినుకులలో స్నానమాడిన తమకముతో వన్నెదేరిన వయసా వారెవా ఓ..ఓ..ఓ..ఓ..ఓ.. కన్ను సైగల తాకిడిలో ఎన్నడరెగని తహతహతో నన్ను లాగిన చొరవా వారెవా తారకలా...దరిచేరగ రా... కోరికతో అభిసారికనై నిలిచా నా చంద్రమా చూశానే అందమా ఒక్కసారి ఒక్కసారి పక్కకొస్తా పక్కకొచ్చి చిక్కనైన చెక్కిలిస్తా ఒక్కసారి ఒక్కసారి వద్దకొస్తా వద్దకొచ్చి ముద్దులిచ్చి ఉద్ధరిస్తా చరణం: 2 తేనె కోరే తుమ్మెదగా చేర వస్తా నెమ్మదిగా పూలతీగ రానా అతిథిగా కమ్ముకొస్తే కాదనకా కౌగిలిస్తా కానుకగా తేనెటీగా రావోయ్ మృదువుగా వందనమే..ఊ....నవనందనమా.. ఊ.. స్వాగతమా యువదొరతనమా నిలువెల్ల ఏలుకో జతవొళ్ళో వాలిపో ఒక్కసారి ఒక్కసారి వద్దకొస్తా వద్దకొచ్చి ముద్దులిచ్చి ఉద్ధరిస్తా ఒక్కసారి ఒక్కసారి పక్కకొస్తా పక్కకొచ్చి చిక్కనైన చెక్కిలిస్తా అరె తకజుం తకజుం తకజుం తకజుం తకధిమి నడకల నడుములో నలిగిన సొగసులు తడుముతా పెదవి మదుపు పెడతా.. హోయ్ వలపు తలుపు తడతా.. హోయ్ ఒక్కసారి ఒక్కసారి వద్దకొస్తా వద్దకొచ్చి ముద్దులిచ్చి ఉద్ధరిస్తా ఒక్కసారి ఒక్కసారి పక్కకొస్తా పక్కకొచ్చి చిక్కనైన చెక్కిలిస్తా


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి