10, జనవరి 2024, బుధవారం

Chinnalludu : Manasemo Mouna Geetham Song Lyrics (మనసే ఓ మౌన గీతం......)

చిత్రం : చిన్నల్లుడు (1993)

సంగీతం : ఎం. ఎం. కీరవాణి

రచన : వేటూరి సుందర రామ మూర్తి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర




పల్లవి:

మనసే ఓ మౌన గీతం...... మనసే ఓ మౌన గీతం కలలో కళ్యాణి రాగం సందె పొద్దు గాలుల్లో సన్నాయి మేళాలు కన్నె వాగు వంకల్లో వయ్యారి తాళాలు చిత్రాలో వర్ణాలో కిన్నెరసాని గీతాలో చిత్రాలో వర్ణాలో కిన్నెరసాని గీతాలో చెలి నాలో పాడింది ప్రేమించిందో ఏమో ఏమో మనసే ఓ మౌన గీతం కలలో కళ్యాణి రాగం చరణం:1

ఆహ్హాహ్హా హ్హాహ్హాహ్హాహ్హా.... ఇది విరి పారిజాతాల జల్లు మేలుకొలుపు లేత వలపు నాలో ఆహ్హాహ్హాహ్హాహ్హాహ్హాహ్హా...... కలిసిన చోట మనసొక పాట జలకములాడే చిలకల జంట ప్రేమించవా అన్న నా కళ్ళని లాలించ వచ్చానులే పాపనై అనుకున్నా ఏనాడో అందాలన్నీ నీకేనని మనసే ఓ మౌన గీతం కలలో కళ్యాణి రాగం చరణం:2

ఆహ్హాహ్హా హ్హాహ్హాహ్హాహ్హా..... యదలో పూల బాణాలు తాకే నీ తళుకులలో తపనలు రేగే ఆహ్హాహ్హా హ్హాహ్హాహ్హాహ్హా....... వలపుల తోట విరిసిన చోట తొలి ఋతువైన తొలకరి పాట నీ అందచందాలు చిత్రాలని సాయంత్ర చలి వేదమంత్రాలని అనుకున్నా ఏనాడో ప్రేమ పెళ్లి నీతోనని మనసే ఓ మౌన గీతం కలలో కళ్యాణి రాగం సందె పొద్దు గాలుల్లో సన్నాయి మేళాలు కన్నె వాగు వంకల్లో వయ్యారి తాళాలు చిత్రాలో వర్ణాలో కిన్నెరసాని గీతాలో పెదవేదో పాడింది ప్రేమించిందో ఏమో ఏమో కనుకే ఈ మౌన గీతం కలిసే కళ్యాణి రాగం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి