Chinnalludu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Chinnalludu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

13, జనవరి 2024, శనివారం

Chinna Alludu : Silko Singari Songs Lyrics (సిల్కో సింగారి కన్యా సిల్కో)

చిత్రం : చిన్నల్లుడు (1993)

సంగీతం : ఎం. ఎం. కీరవాణి

రచన : వేటూరి సుందర రామ మూర్తి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర


పల్లవి:

F : ఆ...హ.... హ...
M : సిల్కో సింగారి కన్యా సిల్కో మిడ్ నైట్ షోకే  
      మేలుకోవే నా సిల్కో
F : దిల్ కో  ఉంటాను నీతో బెడ్ లైట్ తీసి  
      ఎల్కో నా ఏకాకో 
M : చల్ మోహన రంగమ్మ నీ  మొగుడిక ఎవరమ్మా
F : నువ్వా  .. నువ్వా.. మరి నువ్వా 
     మదన జనకుడా రా 
M : సిల్కో సింగారి కన్యా సిల్కో మిడ్ నైట్ షోకే 
       మేలుకోవే నా సిల్కో
F : దిల్ కో  ఉంటాను నీతో బెడ్ లైట్ తీసి  
      ఎల్కో నా ఏకాకో 

చరణం 1:

M : రసిక రంభలా  భళా భళా వలపు  లోక వనిత 
ప్రేక్షకులందరి ప్రేయసి నీవే.. కోడె సుందరి 
F : యువత మన్మధ పద పద పూల   బంతి కడతా 
     (M :అబ్బో )  నేనుని మాత్రం మేనకనే విశ్వమిత్రుడా
M : చిత్రాంగివి నీవేలే హోయ్ చింతామణివే లే
F : తెరకు వెలుగుని రా........
M : సిల్కో సింగారి కన్యా సిల్కో మిడ్ నైట్ షోకే  
      మేలుకోవే నా సిల్కో
F : ఆ...ఆ..  ఆహ.... 
      దిల్ కో   ఉంటాను నీతో బెడ్ లైట్ తీసి  
     ఎల్కో నా ఏకాకో 

చరణం 2:

F : ఆ...ఆ..  ఆహ....  ఛీ... ఛీ....
M : చలనచిత్రిక చక చక విసురు ముద్దు చిలక 
        టౌనుకు పల్లెకు పల్లకి జాంగ్రీ  నీవే తారామణి 
F : సొగసు మానవా ఎడ పెడ మసుగులోన పడతా
     (M : అయ్య బాబోయ్ )
     కొంపలు ముంచిన కోమలి నేనే కోరి కాదురా
M : సంసారిని కాదే.  సరసానికి రావే..
F : మంచు బొమ్మని రా 
M : సిల్కో సింగారి కన్యా సిల్కో మిడ్ నైట్ షోకే  
      మేలుకోవే నా సిల్కో
F : అ...అ.. . దిల్ కో  ఉంటాను నీతో బెడ్ లైట్ తీసి  
      ఎల్కో నా ఏకాకో 
M : చల్ మోహన రంగమ్మ నీ  మొగుడిక ఎవరమ్మా
F : మదన జనకుడా రా   రా..

10, జనవరి 2024, బుధవారం

Chinnalludu : Manasemo Mouna Geetham Song Lyrics (మనసే ఓ మౌన గీతం......)

చిత్రం : చిన్నల్లుడు (1993)

సంగీతం : ఎం. ఎం. కీరవాణి

రచన : వేటూరి సుందర రామ మూర్తి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర




పల్లవి:

మనసే ఓ మౌన గీతం...... మనసే ఓ మౌన గీతం కలలో కళ్యాణి రాగం సందె పొద్దు గాలుల్లో సన్నాయి మేళాలు కన్నె వాగు వంకల్లో వయ్యారి తాళాలు చిత్రాలో వర్ణాలో కిన్నెరసాని గీతాలో చిత్రాలో వర్ణాలో కిన్నెరసాని గీతాలో చెలి నాలో పాడింది ప్రేమించిందో ఏమో ఏమో మనసే ఓ మౌన గీతం కలలో కళ్యాణి రాగం చరణం:1

ఆహ్హాహ్హా హ్హాహ్హాహ్హాహ్హా.... ఇది విరి పారిజాతాల జల్లు మేలుకొలుపు లేత వలపు నాలో ఆహ్హాహ్హాహ్హాహ్హాహ్హాహ్హా...... కలిసిన చోట మనసొక పాట జలకములాడే చిలకల జంట ప్రేమించవా అన్న నా కళ్ళని లాలించ వచ్చానులే పాపనై అనుకున్నా ఏనాడో అందాలన్నీ నీకేనని మనసే ఓ మౌన గీతం కలలో కళ్యాణి రాగం చరణం:2

ఆహ్హాహ్హా హ్హాహ్హాహ్హాహ్హా..... యదలో పూల బాణాలు తాకే నీ తళుకులలో తపనలు రేగే ఆహ్హాహ్హా హ్హాహ్హాహ్హాహ్హా....... వలపుల తోట విరిసిన చోట తొలి ఋతువైన తొలకరి పాట నీ అందచందాలు చిత్రాలని సాయంత్ర చలి వేదమంత్రాలని అనుకున్నా ఏనాడో ప్రేమ పెళ్లి నీతోనని మనసే ఓ మౌన గీతం కలలో కళ్యాణి రాగం సందె పొద్దు గాలుల్లో సన్నాయి మేళాలు కన్నె వాగు వంకల్లో వయ్యారి తాళాలు చిత్రాలో వర్ణాలో కిన్నెరసాని గీతాలో పెదవేదో పాడింది ప్రేమించిందో ఏమో ఏమో కనుకే ఈ మౌన గీతం కలిసే కళ్యాణి రాగం

17, జులై 2021, శనివారం

Chinnalludu : Kurradu Baboi Song Lyrics (కుర్రాడు బాబోయ్)

చిత్రం : చిన్నల్లుడు (1993)

సంగీతం : ఎం. ఎం. కీరవాణి

రచన : వేటూరి సుందర రామ మూర్తి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర


పల్లవి: కుర్రాడు బాబోయ్ కుంపటెట్టినాడు పిల్లాడు బాబోయ్ గిల్లి పెట్టినాడు కుర్రాడు బాబోయ్ కుంపటెట్టినాడు పిల్లాడు బాబోయ్ గిల్లి పెట్టినాడు పరికిణి పావడ పరువపు ఆవడ...రుచిమరిగిన మగడా విరహపు వీరుడ రసికుల సోముడ...విడువకు విరుల జడా అమ్మాయి బాబోయ్ అందమైన పిట్ట బుజ్జాయి బాబోయ్ బుజ్జగించుకుంట అమ్మాయి బాబోయ్ అందమైన పిట్ట బుజ్జాయి బాబోయ్ బుజ్జగించుకుంట అలిగిన పోకడ వలపుల రాకడ..తెలిసెను చలి గురుడా నున్నని నీమెడ వెన్నెల మీగడ..చెలిమికి చెరుకుగడా కుర్రాడు బాబోయ్ కుంపటెట్టినాడు పిల్లాడు బాబోయ్ గిల్లి పెట్టినాడు అమ్మాయి బాబోయ్ అందమైన పిట్ట బుజ్జాయి బాబోయ్ బుజ్జగించుకుంట చరణం: 1 ముద్దు లియ్యవే...సిగ్గు నడికిస్తా సిగ్గు లెందుకే...చీర నడిగోస్తా చీర లెందుకే...చీపు రెట్టుకోస్తా చీపు రెందుకే....దుమ్ము దులిపేస్తా పోద్దుగూకితే....తేనిటీగ చురక తెల్లవారితే...బుగ్గ మీద మరక మంచెనీడలో ...మల్లెపూల పడక కుర్రాడు బాబోయ్ కుంపటెట్టినాడు పిల్లాడు బాబోయ్ గిల్లి పెట్టినాడు అమ్మాయి బాబోయ్ అందమైన పిట్ట బుజ్జాయి బాబోయ్ బుజ్జగించుకుంట చరణం: 2 ఆత్రమెందుకు...అందముందిగనుకా అందమెందుకు...చూపు ఉందిగనుకా చూపు ఎందుకు...చాటుకొస్తె చెపుతా చాటుకెందుకు...వచ్చి చూడు చెపుతా ఏమి చూడను...చూడలేని చుక్కా ఏమి చేయను...ఏసుకోవే పక్కా ఆడ ఊపిరి అంటుంకుంటే లక్క.. అమ్మాయి బాబోయ్ అందమైన పిట్ట బుజ్జాయి బాబోయ్ బుజ్జగించుకుంట కుర్రాడు బాబోయ్ కుంపటెట్టినాడు పిల్లాడు బాబోయ్ గిల్లి పెట్టినాడు చరణం: 3 వయసు చెప్పవే...బోమ్మిడాయి పులుసు మనసు విప్పవే...విప్పుకుంటే అలుసు సోగసు దాచకు...దాచకుంటే కరుసు చెక్కిళ్ళు ఇయ్యవే...తొక్కలేను అడుసు వేడిపొంగులో...ఈడు పచ్చిపులుసు తీపి అలకలొ...తాపమెంతో తెలుసు బండిసాగితే పండుతుంది ఇరుసు కుర్రాడు బాబోయ్ కుంపటెట్టినాడు పిల్లాడు బాబోయ్ గిల్లి పెట్టినాడు పరికిణి పావడ పరువపు ఆవడ...రుచిమరిగిన మగడా విరహపు వీరుడ రసికుల సోముడ...విడువకు విరుల జడా....