10, జనవరి 2024, బుధవారం

Gillikajjalu : Bangaru Bomma Song Lyrics (బంగరు బొమ్మా)

చిత్రం : గిల్లి కజ్జాలు(1998)

సంగీతం : కోటి

రచన : సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర




ఓ ఓ ఓ... బంగరు బొమ్మా నీ అనురాగం నాకు సొంతమా అల్లరి కన్నా ఈ అనుమానం నీకు న్యాయమా ఇది కరగని కల అనుకోన కల కాదని ఎదురుగ ఉన్నా ఒళ్ళో ఇలా వాలిన పెన్నిధి వద్దనగలనా వెయ్యేళ్లిలా నీ పద సన్నిధి స్వర్గమె అననా బంగరు బొమ్మా నీ అనురాగం నాకు సొంతమా అల్లరి కన్నా ఈ అనుమానం నీకు న్యాయమా హరివిల్లె తరునిగ మారి దివి నుంచి దిగొచ్చెనా సుకుమారి కుసమకుమారి నను కోరి తపించెనా మెరుపల్లె చొరవగ చేరి వరమాలై వరించదా చినుకల్లే చిలిపిగ గిల్లి వరదల్లె అల్లేయనా అందాల వెల్లువ నాపే సంగ్రాన్నై స్వాగతమనన అందిస్తా... విందిస్తా... జయించనా నీ హృదయాన్నే ప్రియ వదన జపించనా నీ పేరే మధన... బంగరు బొమ్మా నీ అనురాగం నాకు సొంతమా అల్లరి కన్నా ఈ అనుమానం నీకు న్యాయమా గత జన్మల పరిచయమేదో చేసింది నిరీక్షణా అదికాస్త పరిణయమైతే నీ నీడై తరించనా చెలి సంకెలు నను రమ్మంటే చెరసాలై బిగించినా ఋణమేదో జతపడమంటే మనసారా తపించనా ప్రణాయాల స్వరముల వాన అడిగింది యవ్వన వీణ కురిపిస్తా... మురిపిస్తా.... ఫలించునా నోచిన నోములు నీ వలన లాలించనా వలపుల ఒడిలోన... బంగరు బొమ్మా నీ అనురాగం నాకు సొంతమా అల్లరి కన్నా ఈ అనుమానం నీకు న్యాయమా ఇది కరగని కల అనుకోన కల కాదని ఎదురుగ ఉన్నా ఒళ్ళో ఇలా వాలిన పెన్నిధి వద్దనగలనా వెయ్యేళ్లిలా నీ పద సన్నిధి స్వర్గమె అననా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి