చిత్రం: జెంటిల్ మాన్ (1995)
రచన: రాజశ్రీ
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, సుజాత మోహన్
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
F: నా ఇంటి ముందున్న పూదోటనడిగేవో..
నా ఒంటి పైన జారే.. నా పైటనడిగేవో.. నీ చెవిలో సందెవేళ ఈ మాటే తెలిపేనే.. నువ్వేనా ప్రాణమే..(నా ఇంటి) M: నువ్వు పలికే పలుకుల్లోన వేడెక్కే వయసంట.. మనసార చేరే వేళ మౌనాలే తగదంట.. F : సుడిగాలి రేగిందంటే చిగురాకే చిత్తంట.. వింతైన ఈ కవ్వింత నా వల్ల కాదంట.. M: ఆషాఢం పోయిందో గోదారి పొంగెనో.. F : వైశాఖం వచ్చిందో.. అందాలే పూచేనో.. M: ఈడే సద్దు చెసెనో.. నీ ఇంటి ముందున్న పూదోటనడిగేవో నీ ఒంటి పైన జారే..నీ పైటనడిగేవో.. నీ చెవిలో సందేవేళ ఈ ఊసె తెలిపేనే.. నేనే నీ ప్రాణమే.. నీ ఇంటి ముందున్న పూదోటనడిగేవో నీ ఒంటి పైన జారే..నీ పైటనడిగేవో.. నీ చెవిలో సందేవేళ ఈ ఊసె తెలిపేనే.. నేనే నీ ప్రాణమే.. F: గుండెల్లో ఒక ఊహ.. ఉయ్యాల ఊగింది.. మాటల్లో వెలిరాలేక పెదవుల్లో ఆగింది.. M : ఊహలకే మాటొస్తే.. హృదయాలే కలిసేను.. చూపులకే నడకొస్తే స్వర్గాలే చేరేను.. F : ఎనలేని అనురాగం.. వెయ్యేళ్ళు సాగాలి.. M: కలలన్ని పండించే.. ముద్దుల్లో తేలాలి.. F: మ్ హుమ్ మ్..పరవశమే.. నా ఇంటి ముందున్న పూదోటనడిగేవో.. నా ఒంటి పైన జారే నా పైటనడిగేవో.. నీ చెవిలో సందెవేళ ఈ మాటే తెలిపేనే.. నువ్వేనా ప్రాణమే.. M: నీ ఇంటి ముందున్న F_మ్ హుమ్ మ్.. M: పూదోటనడిగేవో..F_మ్ హుమ్ మ్.. M: నీ ఒంటి పైన జారే.. నీ పైటనడిగేవో.. M: నీ చెవిలో సందేవేళ F_మ్ హుమ్ మ్.. M: ఈ ఊసె తెలిపేనే.. M & F : నేనే నీ ప్రాణమే..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి