10, జనవరి 2024, బుధవారం

GilliKajjalu : Prapanchama Song Lyrics (ప్రపంచమా క్షమించుమా)

చిత్రం : గిల్లి కజ్జాలు(1998)

సంగీతం : కోటి

రచన : సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , సునీత




పల్లవి: ప్రపంచమా క్షమించుమా మాకు నీతో పనేమి లేదమ్మా వసంతమా వరించుమా స్వాగతాంజలి స్వీకరించమ్మా కాంచన కాంతుల భామ నీ కంచెలు తెంచుకు రామ్మా కాంక్షలు పెంచిన ప్రేమ నీ పంచనే మా చిరునామా ఈ ఏకాంతం మనదే స్నేహమా ఆ...ఆ...ఆ... వసంతమా వరించుమా స్వాగతాంజలి స్వీకరించమ్మా చరణం:1 కుడి ఎడమలు ఎరగక మన కథ సాగేనంటా జత కుదరని ఎదలకు పెరుగగా ఏదో మంట ఎవరెవరికో ఎద రగిలితే అది మనకేమంటా కనులడిగిన కలలను తరుముతూ పోదామంటా మనకు మనకు గల ముచ్చట మరి ఎవరు కనని చోటెచ్చట ముడులు విడని బిగి కౌగిట తగు విడిది మనకు దొరికేనట మరి ఆలస్యం ఇంకా ఎంటటా ఆ...ఆ...ఆ... ప్రపంచమా క్షమించుమా మాకు నీతో పనేమి లేదమ్మా చరణం:2 తెరమరుగున నిలువక చొరవగా రారమ్మంటా అరమరికలు తెలియని చెలిమిని అందిమ్మంటా కలవరపడు గుసగుస కబురును విన్నానంటా మనసెరిగిన వరుసకు సరసనే ఉన్నానంటా ఉరుము వెనుక జడివానలా ఈ విరహమంత కరిగేదెలా దిగులు పడకు నువ్వంతలా తొలివలపు తెగని విరి సంకెలా మరి దూరంగా ఉంటే ఇంకెలా ఆ...ఆ...ఆ... వసంతమా వరించుమా స్వాగతాంజలి స్వీకరించమ్మా కాంచన కాంతుల భామ నీ కంచెలు తెంచుకు రామ్మా కాంక్షలు పెంచిన ప్రేమ నీ పంచనే మా చిరునామా ఈ ఏకాంతం మనదే స్నేహమా ఆ...ఆ...ఆ...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి