10, జనవరి 2024, బుధవారం

Mondi Mogudu Penki Pellam : Kondamalleku Musirina Song Lyrics (కొండమల్లెకు ముసిరిన తుమ్మెదలా)

చిత్రం : మొండిమొగుడు పెంకి పెళ్ళాం (1990)

సంగీతం : ఎం. ఎం. కీరవాణి

రచన : వేటూరి సుందర రామ మూర్తి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర




కొండమల్లెకు ముసిరిన తుమ్మెదలా కోన వెన్నెల కురిసిన పూపొదలా సెలయేరై ఉరికే జోరులో అలవై నన్ను లాలించుకో చెలినీవై కలిసే వేళలో కసిగా వచ్చి కవ్వించుకో కొండమల్లెకు ముసిరిన తుమ్మెదలా కోన వెన్నెల కురిసిన పూపొదలా తానమాడు తంగేటి తేనెలలో తాళమేసుకో తీపి ముద్దూ తీగమీటి పోయేటి వెన్నెలలో పాటకన్నా నీ పైట ముద్దు కౌగిలింతల కుస్తీ తనకిస్తీ కన్నెవలపుల కుస్తీ చవిచూస్తి కొండమల్లెకు ముసిరిన తుమ్మెదలా కో..కోకో..కోన వెన్నెల కురిసిన పూపొదలా కోకిలమ్మ కొత్తిల్లు కోరుకునీ అత్త ఇంటికే చేరె నేడు గున్నమావి కొమ్మల్ని వీడుకుని గుండెగొంతులో పాట పాడు చేతిలో చేయివేస్తీ మనసిస్తీ రాజధానని వస్తీ ఎద బస్తీ కొండమల్లెకు ముసిరిన తుమ్మెదలా కోన వెన్నెల కురిసిన పూపొదలా సెలయేరై ఉరికే జోరులో అలవై నన్ను లాలించుకో చెలినీవై కలిసే వేళలో కసిగా వచ్చి కవ్వించుకో కొండమల్లెకు ముసిరిన తుమ్మెదలా కోన వెన్నెల కురిసిన పూపొదలా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి