చిత్రం : మొండిమొగుడు పెంకి పెళ్ళాం (1990)
సంగీతం : ఎం. ఎం. కీరవాణి
రచన : వేటూరి సుందర రామ మూర్తి
గానం: యం.యం.కీరవాణి,యం.యం.శ్రీలేఖ
పల్లవి: నాటకాల జగతిలో జాతకాల జావళి కాలుతున్న కట్టేరా చచ్చేనాడు నీ చెలి నీటిలో తార ఉండదు నింగిలో చేప ఉండదు నీతికి నీరే పుట్టదు నీకు ఈ బాధే తప్పదు చరణం:1 పరువాల పాప చెరువుల్లో చేప నీరంత కడిగేస్తున్నా అది చూసి లోకం విసిరేస్తే గాలం జాలైనా కాపాడేనా విలువ బలైనా జన్మకు శిలువ పడేనా విధికి గులామై ధర్మం తలవంచేనా చేలైన మేసేటి కంచెలివేలే నాటకాల జగతిలో జాతకాల జావళి కాలుతున్న కట్టేరా చచ్చేనాడు నీ చెలి నీటిలో తార ఉండదు నింగిలో చేప ఉండదు నీతికి నీరే పుట్టదు నీకు ఈ బాధే తప్పదు చరణం:2 అందాల చెల్లి తన చంటి తల్లి మానాలు మసిబారేనా ఓణికి రాని ఓ ఆడప్రాణి సింగాల కసి చూసేనా నరకమనేది ఇంటికి ముందు వసారా శునకమనేది భర్తకు మిగిలిన పేరా దయ్యాలు వేదాలు పాడిన వేళ నాటకాల జగతిలో జాతకాల జావళి కాలుతున్న కట్టేరా చచ్చేనాడు నీ చెలి నీటిలో తార ఉండదు నింగిలో చేప ఉండదు నీతికి నీరే పుట్టదు నీకు ఈ బాధే తప్పదు