10, జనవరి 2024, బుధవారం

Mondi Mogudu Penki Pellam : Laaloo Darwaja Lasker Song Lyrics (లాలూ దర్వాజ )

చిత్రం : మొండిమొగుడు పెంకి పెళ్ళాం (1990)

సంగీతం : ఎం. ఎం. కీరవాణి

రచన : వేటూరి సుందర రామ మూర్తి

గానం: యస్.పి.శైలజ




లాలూ దర్వాజ లస్కర్ బోనాల్ పండగకస్తనని రాకపోతివి లకిడీకాపూల్ పోరికి లబ్బర్ గాజుల్ తెస్తని తేకపోతివి లాలూ దర్వాజ లస్కర్ బోనాల్ పండగకస్తనని రాకపోతివి లకిడీకాపూల్ పోరికి లబ్బర్ గాజుల్ తెస్తని తేకపోతివి అవ్ మల్ల... ఒట్టి జూట మాట చెప్పి ఒచ్చేదాక లొల్లిపెట్టి పట్టుకుంటె పోరగాడు పలకనామ పారిపోయె... తుర్... లాలూ దర్వాజ లస్కర్ బోనాల్ పండగకస్తనని రాకపోతివి లకిడీకాపూల్ పోరికి లబ్బర్ గాజుల్ తెస్తని తేకపోతివి ఆడే సెలికాడు నాకు లాఠీ పోలీసు ఓడు ఆడ్నే పేమించినాను సై సై సై కిష్నా నీ కంటివాడు ఇంకా మా కొంటెవాడు కన్నేకొట్టిండు నాకు హొయ్ హొయ్ హొయ్ నెమలి పింఛమొకటి తక్కువా ఆడి పొగరు జూస్తే తగని మక్కువ యహ నాకు మాత్రమేవి తక్కువా ఆడెపుస్తకట్టి పెనిమిటవ్వగా యాడికో వుర్కుతాడనే ఏసినా ముక్కుతాడునే కొంగులాగినోడితోనే కొంగుముల్లు ఏసుకున్న ఏడుకైన కన్నెవూసు నేడు మల్ల చెప్పుకున్న కుర్... సమజైనదా?

లాలూ దర్వాజ లస్కర్ బోనాల్ పండగకస్తనని రాకపోతివి లకిడీకాపూల్ పోరికి లబ్బర్ గాజుల్ తెస్తని తేకపోతివి టోపీ చప్రాసికన్న బీడీ బంట్రోతుకన్న పోలీస్ పటేల్ బత్కు డొయ్... డొయ్... డొయ్... గదిలో పెండ్లంతో ఉన్న గంటల్ ఫోనొస్తెమల్ల ఎంటన్ పెట్టాల పర్గు రయ్... రయ్... రయ్... పొద్నలేస్తే ఖూనికేసులు పీన్గలెత్తె దాక సావు కాపులు బందులైతేగస్తితిర్గుడు ఆడ బందూకెత్తి గోలి కాల్పులు ఉండవే కంటి నిద్రలు ఏలకే తిండి తిప్పలు అడివికెల్లి బదలి ఇస్తే ఆలుబిడ్డ యాదమర్చి ఆకుఅలం మెక్కుడేలె మీకు బలం మింగుడేలె కుర్... జర గుస్స జైకుండ్రీ నే సచ్ఛా జెప్తున్నా

లాలూ దర్వాజ లస్కర్ బోనాల్ పండగకస్తనని రాకపోతివి లకిడీకాపూల్ పోరికి లబ్బర్ గాజుల్ తెస్తని తేకపోతివి

లాలూ దర్వాజ లస్కర్ బోనాల్ పండగకస్తనని రాకపోతివి లకిడీకాపూల్ పోరికి లబ్బర్ గాజుల్ తెస్తని తేకపోతివి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి