8, జనవరి 2024, సోమవారం

Mutyala Muggu : Edo Edo Annadi Song Lyrics (ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు )

చిత్రం : ముత్యాల ముగ్గు (1975)

రచన : డా॥సి.నారాయణరెడ్డి

సంగీతం : కె.వి.మహదేవన్

గానం : రామకృష్ణ



ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు గూటి పడవలో విన్నది కొత్త పెళ్లి కూతురు ఏదో ఏదో అన్నది ఈ మసక మసక వెలుతురు గూటి పడవలో విన్నది కొత్త పెళ్లి కూతురు ఒదిగి ఒదిగి కూర్చుంది బిడియపడే ఒయ్యారం ముడుచుకొనే కొలది మరి మిడిసిపడే సింగారం సోయగాల విందులకై వేయి కనులు కావాలి... ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు గూటి పడవలో విన్నది కొత్త పెళ్లి కూతురు నింగిలోని వేలుపులు ఎంత కనికరించారో నిన్ను నాకు కానుకగా పిలిచి కలిమినొసగేరు పులకరించు మమతలతో పూల పాన్పు వేశారు... ఏదో ఏదో అన్నది ఈ మసక మసక వెలుతురు గూటి పడవలో విన్నది కొత్త పెళ్లి కూతురు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి