8, జనవరి 2024, సోమవారం

Mutyala Muggu : Mutyamanta Pasupu Song Lyrics (ముత్యమంతా పసుపు )

చిత్రం : ముత్యాల ముగ్గు (1975)

రచన : ఆరుద్ర

సంగీతం : కె.వి.మహదేవన్

గానం : పి. సుశీల



ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయా..ఆ..ఆ..ఆ..ఆ ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయా ముద్దు మురిపాలొలుకు ముంగిళ్ళలోన మూడు పువ్వులు ఆరు కాయల్లు కాయ ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ

చరణం 1: ఆరనయిదో తనము ఏ చోట నుండు అరుగులలికే వారి అరచేతనుండు ఆరనయిదో తనము ఏ చోట నుండు అరుగులలికే వారి అరచేతనుండు తీరైన సంపదా ఎవరింట నుండు.. తీరైన సంపదా ఎవరింట నుండు... దిన దినము ముగ్గున్న లోగిళ్ళనుండు ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయా..ఆ..ఆ..ఆ..ఆ

చరణం 2: కోటలో తులిసెమ్మ కొలువున్న తీరు కోరి కొలిచేవారి కొంగు బంగారూ.. కోటలో తులిసెమ్మ కొలువున్న తీరు కోరి కొలిచేవారి కొంగు బంగారూ.. గోవు మాలక్ష్మికి కోటి దండాలు.. గోవు మాలక్ష్మికి కోటి దండాలు.. కోరినంత పాడి నిండు కడవళ్ళూ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయా..ఆ..ఆ..ఆ..ఆ

చరణం 3: మగడు మెచ్చిన చాన కాపురంలోన మొగలి పూల గాలి ముత్యాల వాన మగడు మెచ్చిన చాన కాపురంలోన మొగలి పూల గాలి ముత్యాల వాన ఇంటి ఇల్లాలికి ఎంత సౌభాగ్యం ఇంటి ఇల్లాలికి ఎంత సౌభాగ్యం ఇంటిల్లిపాదికి అంత వైభోగం ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయా ముద్దు మురిపాలొలుకు ముంగిళ్ళలోన మూడు పువ్వులు ఆరు కాయల్లు కాయ ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి