చిత్రం: పండంటి కాపురానికి 12 సూత్రాలు (1983)
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి
సంగీతం: సత్యం
వెన్నెల్లో ఈ నీలాకాశం వెన్నెల్లో ఈ నీలాకాశం కన్నుల్లో ఈ ప్రేమావేశం మల్లెల్లో మన్మధ సందేశం ఈ మధుమాసం మన కోసం ఊ ఊ ఈ మధుమాసం మన కోసం వెన్నెల్లో ఈ నీలాకాశం కన్నుల్లో ఈ ప్రేమావేశం మల్లెల్లో మన్మధ సందేశం ఈ మధుమాసం మన కోసం ఊ ఊ ఈ మధుమాసం మన కోసం ఆహహా ఆహాహాహాహా ఓహొహో ఓహోహోహోహో హృదయాల మోహం అధరాల దాహం చెలరేగు ప్రాయం ఈ యవ్వనం సెగలైన తాపం పగలెల్ల శాపం ఈ రేయి కోసం వేచింది పాపం చందన చర్చలు శీతల సేవలు వద్దూ ఊ ఈ తీరని తాపం తీర్చును తీయని ముద్దు ఆ చందన చర్చలు శీతల సేవలు వద్దూ ఊ ఈ తీరని తాపం తీర్చును తీయని ముద్దూ తొలిముద్దులో ఉంది తుదిలేని పాశం వెన్నెల్లో ఈ నీలాకాశం కన్నుల్లో ఈ ప్రేమావేశం మల్లెల్లో మన్మధ సందేశం ఈ మధుమాసం మన కోసం ఊ ఊ ఈ మధుమాసం మన కోసం మనసైన రాగం అనువైన తాళం రచియించు గీతం ఈ జీవితం ఆనంద గానం అందాల నాట్యం సరిపాళ్ల పాకం శృంగార లోకం అంగజుబారికి లొంగని వారలు ఎవరూ ఊ శృంగారంలో నింగిని తాకిందెవరు ఆ అంగజుబారికి లొంగని వారలు ఎవరూ ఊ శృంగారంలో నింగిని తాకిందెవరు ప్రతిరోజు తుది చూసి మిగలాలి శేషం వెన్నెల్లో ఈ నీలాకాశం కన్నుల్లో ఈ ప్రేమావేశం మల్లెల్లో మన్మధ సందేశం ఈ మధుమాసం మన కోసం ఊ ఊ ఈ మధుమాసం మన కోసం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి