8, జనవరి 2024, సోమవారం

Postman : Rajahamsa Song Lyrics (రాజహంస చీర కట్టి రాజా గుమ్మాది)

చిత్రం: పోస్ట్ మాన్ (2000)

రచన: సుద్దాల అశోకతేజ

గానం: K. J. యేసుదాస్ , కె.యస్.చిత్ర

సంగీతం: వందేమాతరం శ్రీనివాస్



రాజహంస చీర కట్టి రాజా గుమ్మాది రాణి గాజులు తొడగాలింకా రావే అమ్మాడి రాజహంస చీర కట్టి రాజా గుమ్మాది రాణి గాజులు తొడగాలింకా రావే అమ్మాడి పన్నీటిలో పసుపు కలిపి పాదాలకు పూయండమ్మా ఈ మేని కురులకు సాంబ్రాని వేయండి ఈ పాల బుగ్గలకు సిరి చుక్క దిద్దండి ఈ జన్మ మరు జన్మ మా బావే నీకు తోడు నీడమ్మా రాజహంస చీర కట్టి రాజా గుమ్మాది రాణి గాజులు తొడగాలింకా రావే అమ్మాడి అరవిందాలంటి కాళ్ళు అలసి పోకుండా అరచేతులపైన నిన్ను నడిపించే వాడు చూడమ్మా నీ వాడమ్మ కడిగిన ముత్యమంటి మంచి మనసు ఉన్నోడు కళ్ళల్లోనా నీకు ఇల్లు కట్టుకున్నోడు నీ పెదవిపైన చిరునవ్వు చదరిపోకుండ చూసుకుంటాను క్షణమైన నీకు ఎడబాటు లేక ఎదలోన దాచుకుంటాను నీ కంటి చెమ్మ రాకుండా కాపాడుకుంటా రావమ్మా పందిట్లో నీకోసం ఆ పెళ్ళి పీటలు సిద్దంగున్నాయి ఓ ఓ ఓ రాజహంస చీర కట్టి రాజా గుమ్మాది రాణి గాజులు తొడగాలింకా రావే అమ్మాడి ఆ భగవంతుడ్ని నేను మీలో చూస్తున్నా ఈ జన్మకు మీకు ఎంతో రుణపడి పోతున్నా చాలండి ఇంక మీ చలవా పుట్టిన ఫలమే లేని ఇంక నీటి బొట్టుకు పసుపు తాడు కట్టి నుదుట బొట్టు ఎందుకు ఎవరెవరి అడుగులెటువైవు పడునో ఎరిగింది లేరమ్మా ఏ నల్లపూసలే పసుపు తాడు జత పడునో తెలిసినది ఆ బ్రహ్మ విధి చేతిలోని పావురం ఎదురాడలేని జీవులం నీవైన నేనైనా ఆ దేవుడు తీర్పు మన్నించాలమ్మా రాజహంస వరుని మెడలో దండ వేస్తుంది రంగ రంగ వైభోగంగా పెళ్లి అవుతుంది రాజహంస వరుని మెడలో దండ వేస్తుంది రంగ రంగ వైభోగంగా పెళ్లి అవుతుంది


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి