Postman లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Postman లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

8, జనవరి 2024, సోమవారం

Postman : Bava Bava Lagam Song Lyrics (బావ బావ లగ్గమెట్టుకోర)

చిత్రం: పోస్ట్ మాన్ (2000)

రచన: సుద్దాల అశోకతేజ

గానం: ఉదిత్ నారాయణ్ , స్వర్ణలత

సంగీతం: వందేమాతరం శ్రీనివాస్




బావ బావ లగ్గమెట్టుకోర బాస చేసి బంతులాడుకోర ఓసి భామ బాసికాలు తేనా బిందెలోన ఉంగరాలు తియ్నా ఆరడుగుల నీ తోడుగా ఏడడుగులేయన నీ నడుములో లే మడతలో నా ముడుపు తీయనా ఓ జల్ది జల్ది జల్ది షాదీ చేసుకుందామా ఓ అల్లి బిల్లి గిల్లి కజ్జాలాడు కుందామా దండలు మార్చుకున్న హే హే హే బావ బావ లగ్గమెట్టుకోర బిందెలోన ఉంగరాలు తియ్నా హే గుండెలోన నేను ఉండబోతే ఎద నిండా అందాలే చోటే లేదే ఒట్టు బావ గుండె నిండ నువే వదిగున్నావని పొంకం వెలుపలి కొచ్చే భామా వచ్చి పదహారు కళలు ఇచ్చి చూపించు రుచి బావా ఉంది పద్దెనిమిదేళ్ల నుండి నీ కొరకు పిచ్చి ఇరవైనాలు గంటాల నా చుట్టూర తిరుగుతావు ఆగిపోని గడియారంలా పెద్దముళ్లు చిన్నముళ్లు కలిసే వేళ కల్లోన నీ అల్లరి ఎలా చెప్పాలా మరి జల్ది జల్ది జల్ది జల్ది లిప్స్ మిలోన సిరి అమ్మా నాన్న తోటి డేట్ ఫిక్స్ కావాలా ముద్దులు పెట్టకు నాకే ఏ ఏ ఏ బావ బావ లగ్గమెట్టుకోర బిందెలోన ఉంగరాలు తియ్నా గట్టు మీద నువ్వు వస్తవుంటే గరికల్లే నీ పాదం ముద్దాడేనా బుగ్గమీద తిష్ట వేసుకునే మెరిసేటి నీ పచ్చ బొట్టై లేదా బావా పస్తు ఎన్నాళ్లు ఇంక పుస్తి కట్టేయి బెస్ట్ భామా పెళ్ళి కాకున్న ముందు ఒళ్ళో కొచ్చేయి మస్తు ఇన్లాండ్ లెటర్ లాగ నన్ను విప్పకు లోన దాచుకున్న ఓనమాలు చూడకు తెలిగ్రాము లాగ నిన్ను అందుకుంటాలే పులకరింత పట్నానికి చేరుస్తాలే నా కాలి మెట్టి పెట్టావంటే మొత్తం ఇస్తాలే అరె అంతదాకా నేను ఎలా తట్టుకోవాలే గడిపే ఊహాలతోనే ఏ ఏ ఏ బావ బావ లగ్గమెట్టుకోర బాస చేసి బంతులాడుకోర హే ఓసి భామ బాసికాలు తేనా బిందెలోన ఉంగరాలు తియ్నా ఆరడుగుల నీ తోడుగా ఏడడుగులేయన నీ నడుములో లే మడతలో నా ముడుపు తీయనా ఓ జల్ది జల్ది జల్ది షాదీ చేసుకుందామా ఓ అల్లి బిల్లి గిల్లి కజ్జాలాడు కుందామా దండలు మార్చుకున్న హే హే హే హే బావ బావ లగ్గమెట్టుకోర బిందెలోన ఉంగరాలు తియ్నా


Postman : Rajahamsa Song Lyrics (రాజహంస చీర కట్టి రాజా గుమ్మాది)

చిత్రం: పోస్ట్ మాన్ (2000)

రచన: సుద్దాల అశోకతేజ

గానం: K. J. యేసుదాస్ , కె.యస్.చిత్ర

సంగీతం: వందేమాతరం శ్రీనివాస్



రాజహంస చీర కట్టి రాజా గుమ్మాది రాణి గాజులు తొడగాలింకా రావే అమ్మాడి రాజహంస చీర కట్టి రాజా గుమ్మాది రాణి గాజులు తొడగాలింకా రావే అమ్మాడి పన్నీటిలో పసుపు కలిపి పాదాలకు పూయండమ్మా ఈ మేని కురులకు సాంబ్రాని వేయండి ఈ పాల బుగ్గలకు సిరి చుక్క దిద్దండి ఈ జన్మ మరు జన్మ మా బావే నీకు తోడు నీడమ్మా రాజహంస చీర కట్టి రాజా గుమ్మాది రాణి గాజులు తొడగాలింకా రావే అమ్మాడి అరవిందాలంటి కాళ్ళు అలసి పోకుండా అరచేతులపైన నిన్ను నడిపించే వాడు చూడమ్మా నీ వాడమ్మ కడిగిన ముత్యమంటి మంచి మనసు ఉన్నోడు కళ్ళల్లోనా నీకు ఇల్లు కట్టుకున్నోడు నీ పెదవిపైన చిరునవ్వు చదరిపోకుండ చూసుకుంటాను క్షణమైన నీకు ఎడబాటు లేక ఎదలోన దాచుకుంటాను నీ కంటి చెమ్మ రాకుండా కాపాడుకుంటా రావమ్మా పందిట్లో నీకోసం ఆ పెళ్ళి పీటలు సిద్దంగున్నాయి ఓ ఓ ఓ రాజహంస చీర కట్టి రాజా గుమ్మాది రాణి గాజులు తొడగాలింకా రావే అమ్మాడి ఆ భగవంతుడ్ని నేను మీలో చూస్తున్నా ఈ జన్మకు మీకు ఎంతో రుణపడి పోతున్నా చాలండి ఇంక మీ చలవా పుట్టిన ఫలమే లేని ఇంక నీటి బొట్టుకు పసుపు తాడు కట్టి నుదుట బొట్టు ఎందుకు ఎవరెవరి అడుగులెటువైవు పడునో ఎరిగింది లేరమ్మా ఏ నల్లపూసలే పసుపు తాడు జత పడునో తెలిసినది ఆ బ్రహ్మ విధి చేతిలోని పావురం ఎదురాడలేని జీవులం నీవైన నేనైనా ఆ దేవుడు తీర్పు మన్నించాలమ్మా రాజహంస వరుని మెడలో దండ వేస్తుంది రంగ రంగ వైభోగంగా పెళ్లి అవుతుంది రాజహంస వరుని మెడలో దండ వేస్తుంది రంగ రంగ వైభోగంగా పెళ్లి అవుతుంది


Postman : Kuku Kuku Song Lyrics (కుకురే కుకురే కుకురే కుకురే)

చిత్రం: పోస్ట్ మాన్ (2000)

రచన: గురు చరణ్

గానం: K. J. యేసుదాస్, కె.యస్.చిత్ర

సంగీతం: వందేమాతరం శ్రీనివాస్



కుకురే కుకురే కుకురే కుకురే కు కు కు కోకిలమ్మ కోనసీమ జాబిలమ్మ కమ్మనైన కబురే తేవమ్మా గు గు గు గోరువంక ఇన్ని మాటలెందుకింక గూటిలోని చోటే నీదమ్మా ఏ మనసు తొలిసారి కలిసిందో ఎవరంటే తెలిసిందో ఇది ప్రేమని ఏ జంట మలిసారి వలచిందో బదులిమ్మని అడిగిందో ఆ ప్రేమని వీచే గాలి చల్లదనాలు దీవెనలేనంటా పూచే పువ్వై నిదురించేది నీ ఒడిలోనంటా కు కు కు కోకిలమ్మ కోనసీమ జాబిలమ్మ కమ్మనైన కబురే తేవమ్మా ఆరు రుతువుల నింగి తోటలో తోటమాలికి ఈ తొందరెందుకో తొడునీడగా చేయి వీడక బాటసారిని తీరాన చేర్చుకో నీలాల నింగి ఆ తారలన్ని ఏ ప్రేమ చేసిన చిరు సంతకం జతగా ఓ ప్రేమ కథగా ఎన్నేళ్ల కైనా ఉందాములే ఎన్నో జన్మల అనుబంధాలే హారతులవ్వాలి నవ్వే నువ్వై నువ్వే నేనై ఒకటై పోవాలి కు కు కు కోకిలమ్మ కోనసీమ జాబిలమ్మ కమ్మనైన కబురే తేవమ్మా గు గు గు గోరువంక ఇన్ని మాటలెందుకింక గూటిలోని చోటే నీదమ్మా ఇంద్ర దనసులో ఏడు రంగులు పల్లవించని నీ మేని సొంపులో తాజ్మహల్ లో ఉన్న వైభవం తొంగి చూడని తొలి ప్రేమలేఖలు నీ మాటలన్ని నా పాటలైతే నిను దాచుకోన నా కవితగా పలికే నా పాటలోన కలకాలముంటా నీ ప్రేమనై కలిసి ముందుకు సాగేటందుకు అడుగులు కలపాలి ముద్దు ముచ్చట తీరేటందుకు ముడులను వేయాలి కు కు కు కోకిలమ్మ కోనసీమ జాబిలమ్మ కమ్మనైన కబురే తేవమ్మా గు గు గు గోరువంక ఇన్ని మాటలెందుకింక గూటిలోని చోటే నీదమ్మా


Postman : Achacha Telugula Song Lyrics (అచ్చ తెనుగులా పదారణాల )

చిత్రం: పోస్ట్ మాన్ (2000)

రచన: ఘంటాడి కృష్ణ

గానం: K. J. యేసుదాస్, సుజాత

సంగీతం: వందేమాతరం శ్రీనివాస్




అచ్చ తెనుగులా పదారణాల కోమాలాంగివే చెలీ అచ్చ తెనుగులా పదారణాల కోమాలాంగివే చెలీ సాయంత్ర సందె వేళ నీవే నా ప్రేమ ముగ్గులోకి రావే ఆనతివ్వగా నా మోహనాన్ని హారతవ్వనా ప్రియా అచ్చ తెనుగులా పదారణాల కోమాలాంగివే చెలీ

ఆ ఛైత్ర మాసాలె మన ప్రేమ సాక్షాలై విడరాని బందమై పోగా నా తోడు నీడల్లె నా కంటి పాపల్లె గుండెల్లో నిన్ను దాచుకోన నిన్నే చేరుకోన ఒడిలొ వాలి పోన నా శ్వాసలొ నిశ్వాస నేనై నా జీవితాన ఆశ నీవై నా చేయినందుకో రావా

అచ్చ తెనుగులా పదారణాల కోమాలాంగివే చెలీ

ఆనతివ్వగా నా మోహనాన్ని హారతవ్వనా ప్రియా కార్తీక వెన్నెల్లో

ఎకాంత వేళల్లో నీడల్లె నిన్ను చేరుకోన నీ రూపే కళ్ళల్లొ కదలాడె వేళల్లొ నీ చంటి పాపనై పోన జగమె మురిసిపోదా ఒకటై కలసి పోగా ఆకాశమె అక్షింతలేయ భూమతయే దీవించ రాదా ఆ మూడు ముళ్ళు వేసేయ్నా

ఆనతివ్వగా నా మోహనాన్ని హారతవ్వనా ప్రియా

అచ్చ తెనుగులా పదారణాల కోమాలాంగివే చెలీ

సాయంత్ర సందె వేళ నీవే నా ప్రేమ ముగ్గులోకి రావే

ఆనతివ్వగా నా మోహనాన్ని హారతవ్వనా ప్రియా

అచ్చ తెనుగులా పదారణాల కోమాలాంగివే చెలీ