9, జనవరి 2024, మంగళవారం

Subhodayam : Raayaithenemiraa Song Lyrics (రాయైతే నేమిరా దేవుడూ.)

చిత్రం : శుభోదయం (1980)

సంగీతం : కె.వి.మహదేవన్

రచన : వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం



మ్మ్.హు... పిచ్చివాడ... రాయైతే నేమిరా దేవుడూ... ఉఉ రాయైతే నేమిరా దేవుడూ... ఉ హాయిగా ఉంటాడు జీవుడూ... ఉన్నచోటే గోపురం... ఉసురులేని కాపురం అన్నీ ఉన్న మహానుభావుడు... రాయైతే నేమిరా దేవుడూ... ఉ హాయిగా ఉంటాడు జీవుడూ... ఉ ఉన్నచోటే గోపురం... ఉసురులేని కాపురం అన్నీ ఉన్న మహానుభావుడు... రేపొచ్చి పాడేటి భూపాల రాగాలు... పన్నీటి జలకాలు పాలాభిషేకాలు కస్తూరి తిలకాలు. కనక కిరీటాలు... కస్తూరీ తిలకం లలాటఫలకే. వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం రేపొచ్చి పాడేటి భూపాల రాగాలు... పన్నీటి జలకాలు పాలాభిషేకాలు కస్తూరి తిలకాలు. కనక కిరీటాలు... తీర్ధ ప్రసాదాలు... దివ్య నైవేద్యాలు ఎవరికి జరిగేను ఇన్ని వైభోగాలు రంగ రంగ వైభోగం... రంగ రంగ వైభోగం రంగ రంగ వైభోగం... రంగ రంగ వైభోగం రంగ రంగ వైభోగం... రంగ రంగ వైభోగం అనాయాసయోగం అంటే ఇదే నాయనా. అనంత వైభోగం రాయైతే నేమిరా దేవుడు... హాయిగా ఉంటాడు జీవుడు... ఉన్నచోటే గోపురం... ఉసురులేని కాపురం అన్నీ ఉన్న మహానుభావుడు... బృందావనిలో లీలా విలాసాలూ... అందాల రాధామ్మతో ప్రేమ గీతాలూ.ఉఉఉఅఅఅఅఅ... బృందావనిలో లీలా విలాసాలు... అందాల రాధామ్మతో ప్రేమ గీతాలు... ఇవన్నీ నాకు జరగాలని కోరుకోరా నాయనా... నువ్వంటే జరుగుతుంది బాలవాక్కు బ్రహ్మ వాక్కురా... నువ్వంటే నాకు దక్కురా.హహహ అఅఅ బాలవాక్కు బ్రహ్మ వాక్కురా... నువ్వంటే నాకు దక్కురా బాలవాక్కు బ్రహ్మ వాక్కురా... అమ్మా... అమ్మ స్వాతంత్రం జన్మ హక్కురా బాలవాక్కు బ్రహ్మ వాక్కురా... స్వాతంత్రం జన్మ హక్కురా భావి భారత వీర పౌర భయము వీడి సాగిపోరా... సాగిపోరా... సాగిపోరా... సాగిపోరా... రాయైతే నేమిరా దేవుడూ... హాయిగా ఉంటాడు జీవుడూ... ఉన్నచోటే గోపురం... ఉసురులేని కాపురం... అన్నీ ఉన్న మహానుభావుడు... అన్నీ ఉన్న మహానుభావుడు...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి