చిత్రం: ఆ ఒక్కటి అడక్కు (1992)
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , యస్.జానకి
సంగీతం: ఇళయ రాజా
పల్లవి:
వారెవా మానవా ఎదలే అదిరే జోరుగా జోడుగా కధలే ముదిరే ఓపలేను తపనలు ఆపలేను మదనుడ రావేరా జత నీవేరా వారెవా పాడవే నిదురే చెదిరే వాటమై జంటగా వలపే కుదిరే
చరణం: 1
మొత్తుకున్న మోహాలకు మోజే బలిసి చెలి గొంతు దాటు దాహాలకు తీపే తెలిసి చీర మాటూ శ్రీలేఖలు లగ్గాలడిగే కడ కొంగు చాటు కోణాలకు ప్రాణాలెగిరే వనితల తలపులే కవితల మెరుపులు పురుషుల వలపులే చరితకు మలుపులు ఇంతగా కోరితే చెంత చేరనా చెంతకే చేరితే చేతులాగునా ఒక ఉడుకై ఒడిదుడుకై చలి చెరుగులెగసెరా వారెవా పాడవే నిదురే చెదిరే వాటమై జంటగా వలపే కుదిరే ఆగలేను తపనలు తాగలేను మదనిక రావేల జత నీవేగా వారెవా మానవా ఎదలే అదిరే జోరుగా జోడుగా కధలే ముదిరే
చరణం: 2
కన్ను కన్ను కావ్యాలకు ప్రాసే కుదిరే మది నిన్ను నన్ను కౌగిళ్ళకు ముందే తలిచే గిచ్చు గిచ్చు గీతాలకు రాగాలదిరే అవి చిచ్చు పెట్టి శ్రీమన్మద లీలే ముదిరే పెదవుల గుసగుసే ప్రేమకు పదనిస తనువుల కలయికే మనువుకు కళ ఇక ఆశగా కోరితే అందమివ్వనా అందమో ఛందమో అంతు చూడనా అది ఉలుకో చెలి పలుకో తొలి వలపు చిలికెనా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి