Aa Okkati Adakku లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Aa Okkati Adakku లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

16, మార్చి 2024, శనివారం

Aa Okkati Adakku : KoKo Ko Ko Kona Lona Song Lyrics (కో కో కో కోన కోన కోలాటకే తోడే రానా)

చిత్రం: ఆ ఒక్కటి అడక్కు (1992)

సాహిత్యం: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , యస్.జానకి

సంగీతం: ఇళయ రాజా



పల్లవి:

కో కో కో కోన కోన కోలాటకే తోడే రానా ఆ కొండలో ఉంది కోనా జా జ జ జ జాజుల్లోన సయ్యాటలో నేనే జాణా ఆ కోన అందాలలోన తైతక్కలాడే పిక్కమ్మ కాడ కైపెక్కే కంటి పాపమ్మ కాడ వాలిందిలే నా పిట్ట రంపంపపం

కో కో కో కోన కోన కోలాటకే తోడే రానా ఆ కొండలో ఉంది కోనా జా జ జ జ జాజుల్లోన సయ్యాటలో నేనే జాణా ఆ కోన అందాలలోన

చరణం: 1

చేమంతి పువ్వంటి చిలక చెయ్యేస్తే రేగింది శృంగార జింక లాగేస్తే నా తీగ ఇంకా కవ్వింతకొస్తుంది కౌగిళ్ల డొంక గిల్లేస్తే పుట్టాల గీతాలెన్నో గీతాలే పాడాల అందాలెన్నో నిద్దట్లో లేడైనా లేవాలమ్మో కుంపట్లో కోడైనా కుయ్యాలమ్మో నిద్దట్లో లేడైనా లేవాలమ్మో కుంపట్లో కోడైనా కుయ్యాలమ్మో కవ్వింతలకు welcome సొగసుకు నా స్వాగతం లవ్ చెయ్ చక చక లక్కీ వేటలో.. జా జ జ జ జాజుల్లోన సయ్యాటలో నేనే జాణా ఆ కోన అందాలలోన


చరణం: 2

నేనైతే నెల్లూరి జాణ నీ ప్రేమ గుండాన ముంచింది కన్నా నేనేలే బెజవాడ దాదా నీ వేణువే పాడి ఆడింది కృష్ణా నే కొంగు తాణాలు చెయ్యాలెన్నో నీ దోర దోపిళ్ళు కావాలెన్నో ఆకాశం దీపాలు పెట్టాలయ్యో సాయంత్ర రూపాలు ముట్టాలమ్మో కవ్వింతలకు వెల్కం సొగసుకు నా స్వాగతం లవ్ చెయ్ చక చక లక్కీ వేటలో కో కో కో కోన కోన కోలాటకే తోడే రానా ఆ కొండలో ఉంది కోనా జా జ జ జ జాజుల్లోన సయ్యాటలో నేనే జాణా ఆ కోన అందాలలోన తైతక్కలాడే పిక్కమ్మ కాడ కైపెక్కే కంటి పాపమ్మ కాడ వాలిందిలే నా పిట్ట రంపంపపం కో కో కో కోన కోన కోలాటకే తోడే రానా ఆ కొండలో ఉంది కోనా జా జ జ జ జాజుల్లోన సయ్యాటలో నేనే జాణా ఆ కోన అందాలలోన

Aa Okkati Adakku : Vareva Maanava song lyrics (వారెవా మానవా ఎదలే అదిరే)

చిత్రం: ఆ ఒక్కటి అడక్కు (1992)

సాహిత్యం: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , యస్.జానకి

సంగీతం: ఇళయ రాజా



పల్లవి:

వారెవా మానవా ఎదలే అదిరే జోరుగా జోడుగా కధలే ముదిరే ఓపలేను తపనలు ఆపలేను మదనుడ రావేరా జత నీవేరా వారెవా పాడవే నిదురే చెదిరే వాటమై జంటగా వలపే కుదిరే

చరణం: 1

మొత్తుకున్న మోహాలకు మోజే బలిసి చెలి గొంతు దాటు దాహాలకు తీపే తెలిసి చీర మాటూ శ్రీలేఖలు లగ్గాలడిగే కడ కొంగు చాటు కోణాలకు ప్రాణాలెగిరే వనితల తలపులే కవితల మెరుపులు పురుషుల వలపులే చరితకు మలుపులు ఇంతగా కోరితే చెంత చేరనా చెంతకే చేరితే చేతులాగునా ఒక ఉడుకై ఒడిదుడుకై చలి చెరుగులెగసెరా వారెవా పాడవే నిదురే చెదిరే వాటమై జంటగా వలపే కుదిరే ఆగలేను తపనలు తాగలేను మదనిక రావేల జత నీవేగా వారెవా మానవా ఎదలే అదిరే జోరుగా జోడుగా కధలే ముదిరే

చరణం: 2

కన్ను కన్ను కావ్యాలకు ప్రాసే కుదిరే మది నిన్ను నన్ను కౌగిళ్ళకు ముందే తలిచే గిచ్చు గిచ్చు గీతాలకు రాగాలదిరే అవి చిచ్చు పెట్టి శ్రీమన్మద లీలే ముదిరే పెదవుల గుసగుసే ప్రేమకు పదనిస తనువుల కలయికే మనువుకు కళ ఇక ఆశగా కోరితే అందమివ్వనా అందమో ఛందమో అంతు చూడనా అది ఉలుకో చెలి పలుకో తొలి వలపు చిలికెనా

Aa Okkati Adakku : Pavuramaa Pavuramaa Song Lyrics (పావురమా పావురమా)

చిత్రం: ఆ ఒక్కటి అడక్కు (1992)

సాహిత్యం: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , యస్.జానకి

సంగీతం: ఇళయ రాజా



పల్లవి:

పావురమా పావురమా మన బ్రతుకే పంజరమా కన్నులలో కాపురమా అందని ఓ గోపురమా పావురమా పావురమా మన బ్రతుకే పంజరమా

చరణం: 1 వెన్నెల్లో మల్లెపూల మంచం వేసి ఉంచాను అందాల మందారాల గంధాలెన్నో దాచాను కళ్ళల్లో ఒత్తులు వేసి నీకై వేచి వున్నాను వెచ్చన్ని కౌగిళ్ళల్లో ఒకటై పోదామన్నాను వెన్నెల పామై కరిచిన వేళ కన్నుల ఆశ కరిగిన వేళ జాలైనా లేనే లేదా రానే రాదా నీకింకా ఈ బాధ తీరేదేట్టా నీవే చెప్పు నాకింకా

చరణం: 2 ఎన్నాళ్ళీ ఉపవాసాలు ఎన్నేళ్ళమ్మా వనవాసం శివరాత్రి రాకుండానే జాగారం అకుంది వక్కా వుంది రెండు కలిసేదేనాడో పరువాల తాంబూలంతో పెదవులు పండేదేనాడో నెమ్మది లేని తుమ్మెద గోల తుమ్మెద రాని పూవుల జ్వాల ఎన్నెన్నో కలలే కన్నా నిన్న నేడు నీకోసం మౌనంగా ఏడుస్తున్నా నాలో నేనే మనకోసం

Aa Okkati Adakku : Rajadhi Rajanu Nenura Song Lyrics (రాజాధి రాజను నేనురా )

చిత్రం: ఆ ఒక్కటి అడక్కు (1992)

సాహిత్యం: భువన చంద్ర

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం

సంగీతం: ఇళయ రాజా



పల్లవి: రాజాధి రాజను నేనురా ఇక వైజాగు వైభోగం చూడరా సరదాల సామ్రాటు నేనురా ఇక సర్కారు సీడెడ్ నావిరా జాక్పాట్టే నేను కొట్టేస్తా జైపూరే నేను పట్టేస్తా టాటాతో మాట కలిపేస్తా బిర్లాకే బీటు వేసేస్తా చరణం: 1 వెండి రేకు వెడ్డింగ్ కార్డు చెల్లి పెళ్ళికి వేస్తానురా గోల్డ్ ఆకు పందిళ్ళు వేస్తే రాజభవనే విడిదిల్లురా పాటియాల రాజు వస్తే భళా ప్లాటినాల పంచలిస్తా పాదరసం కళ్ళు కడిగి పెళ్లి పెళ్ళుమంటూ పెళ్లి చేస్తా రాజమాత కంట రత్నాల చినుకులంట మా చెల్లి పెళ్లి కట్నం నా స్విస్సు బ్యాంకు ఖాతా అరె కింగాది కింగులంతా డంగయ్యే పెళ్లి చేస్తా రాజాధి రాజను నేనురా ఇక వైజాగు వైభోగం చూడరా సరదాల సామ్రాటు నేనురా ఇక సర్కారు సీడెడ్ నావిరా జాక్పాట్టే నేను కొట్టేస్తా జైపూరే నేను పట్టేస్తా టాటాతో మాట కలిపేస్తా బిర్లాకే బీటు వేసేస్తా రాజాధి రాజను నేనురా ఇక వైజాగు వైభోగం చూడరా సరదాల సామ్రాటు నేనురా ఇక సర్కారు సీడెడ్ నావిరా చరణం: 2 జార్దిసొత్తు ఈ స్టీలు ప్లాంట్ రాసి ఇస్తా రారండిరో కప్పలల్లె మూగేటి మేకు షిప్ యార్డే ఇస్తానురో రత్నాల రాసులెన్నో రాయల్లా రాశి ఇస్తా రంభంటి ఊర్వశోస్తే రాయల్ లా లవ్వు చేస్తా గంటకొక్క కోటి మా అమ్మ రామకోటి లక్ష్మిదేవితోనే నాకుంది లావాదేవి అరె ఎంపరర్ల కొండల్లో ఎవరెస్టు లాంటి వాణ్ణి రాజాధి రాజను నేనురా ఇక వైజాగు వైభోగం చూడరా సరదాల సామ్రాటు నేనురా ఇక సర్కారు సీడెడ్ నావిరా జాక్పాట్టే నేను కొట్టేస్తా జైపూరే నేను పట్టేస్తా టాటాతో మాట కలిపేస్తా బిర్లాకే బీటు వేసేస్తా రాజాధి రాజను నేనురా ఇక వైజాగు వైభోగం చూడరా సరదాల సామ్రాటు నేనురా ఇక సర్కారు సీడెడ్ నావిరా

Aa Okkati Adakku : Unclu digiravaiah Song Lyrics (అంకులు దిగి రావేమయ్యో)

చిత్రం: ఆ ఒక్కటి అడక్కు (1992)

సాహిత్యం: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం

సంగీతం: ఇళయ రాజా



పల్లవి:

అంకులు దిగి రావేమయ్యో శోభనం జరాకానీవాయ్యో లక్కుకే ఎసరెట్టోద్దయ్యొ బెడ్డు తో ముడి పెట్టొద్దయ్యొ ఒక్కసారి ఓ మావ పిల్లనంపు హాహాహా తాతనే చెయ్యనా మోతగా దేవుడు దిగి రావేమయ్యో శోభనం జరా కానీవాయ్యో దేవుడు దిగి రావేమయ్యో శోభనం జరా కానీవాయ్యో

చరణం: 1 వయసే తొడగొడితే కసితో మతి చెడి ఉసిగా ఎగబడదా అరె హా మనసే త్వరపెడితే అడుగే తడబడి ఎదుటే తెగబడదా అరె హా పండంటి మా కాపురాన ఎన్నేళ్లు కురిసేనా అప్పిచ్చి పడుతున్న బాద పట్టించుకొనలేవా ఓ లచ్చ జమచేసుకుంటే పాలిచ్చి పంపేయనా ఆ లచ్చ మన దగ్గరుంటే ఓ చెక్కు విసిరెయ్యనా ఖర్మ అంకులు దిగి రావేమయ్యో శోభనం జరాకానీవాయ్యో లక్కుకే ఎసరెట్టోద్దయ్యొ బెడ్డు తో ముడి పెట్టొద్దయ్యొ ఒక్కసారి ఓ మావ పిల్లనంపు హాహాహా తాతనే చెయ్యనా మోతగా దేవుడు దిగి రావేమయ్యో శోభనం జరా కానీవాయ్యో చరణం: 2

చలిలో యమ గిలిలో నిదరే కుదరక గదిలో నిలిబడితే అరె హా సతితో మదవతితో కులికే సమయము వృధాగా పరిగెడితే అరె హా ఒళ్ళంతా సెగలాయే మావ ఇకనైనా దయ రాదా నీయబ్బ తగిలావు మాకు నడిమధ్య శనిలాగ అయ్యన్నీ మనకాడ కాదోయ్ సొమ్మంతా జమకట్టు రెడ్డొచ్చి మొదలాడమంటావ్ నీయబ్బ.. నీయవ్వ ముసలాడ అల్లుడు నస మానేవయ్యో డబ్బులు జమ కట్టేవాయ్యో లక్కుకే ఎసరెట్టోద్దయ్యొ బెడ్డు తో ముడి పెట్టొద్దయ్యొ ఒక్కసారి ఓ మావ పిల్లనంపు హాహాహా... తాతనే చెయ్యనా మోతగా దేవుడు దిగి రావేమయ్యో శోభనం జరా కానీవాయ్యో దేవుడు దిగి రావేమయ్యో శోభనం జరా కానీవాయ్యో