9, మార్చి 2024, శనివారం

America Ammayi : Oka Venuvu Song Lyrics (ఒక వేణువు వినిపించెను)

చిత్రం: అమెరికా అమ్మాయి (1976)

సాహిత్యం: మైలవరపు గోపి

గానం: జి. ఆనంద్

సంగీతం: జి. కె. వెంకటేష్


పల్లవి:

ఒక వేణువు వినిపించెను అనురాగ గీతికా ఒక రాధిక అందించెను నవరాగ మాలికా ఒక వేణువు వినిపించెను అనురాగ గీతికా

చరణం: 1

సిరి వెన్నెల తెలబోయెను జవరాలి చూపులో సిరి వెన్నెల తెలబోయెను జవరాలి చూపులో నవ మల్లిక చినవోయెను నవ మల్లిక చినవోయెను చిరునవ్వు సొగసులో ఒక వేణువు వినిపించెను అనురాగ గీతికా

చరణం: 2

వనరాణియె అలివేణికి సిగపూలు తురిమెనూ వనరాణియె అలివేణికి సిగపూలు తురిమెనూ రేరాణియె నా రాణికి రేరాణియె నా రాణికి పారాణి పూసెను ఒక వేణువు వినిపించెను అనురాగ గీతికా

చరణం: 3

ఏ నింగికి ప్రభవించెనొ నీలాల తారకా ఏ నింగికి ప్రభవించెనొ నీలాల తారకా నా గుండెలొ వెలిగించెను నా గుండెలొ వెలిగించెను సింగార దీపిక ఒక వేణువు వినిపించెను అనురాగ గీతికా ఒక రాధిక అందించెను నవరాగ మాలికా ఒక వేణువు వినిపించెను అనురాగ గీతికా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి