9, మార్చి 2024, శనివారం

Prema Lekhalu : Idi Teeyani Vennela Song Lyrics ( ఇది తీయని వెన్నెల రేయి... )

చిత్రం: ప్రేమ లేఖలు (1977)

సాహిత్యం: ఆరుద్ర

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , పి.సుశీల

సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం



పల్లవి:

ఇది తీయని వెన్నెల రేయి... మది వెన్నెల కన్నా హాయి నా ఊహల జాబిలి రేఖలు... కురిపించెను ప్రేమలేఖలు ఇది తీయని వెన్నెల రేయి... మది వెన్నెల కన్నా హాయి

చరణం 1: ఆ... హా హా హా... ఆహా... ఆహాహా... సుజా... నడిరాతిరి వేళ నీ పిలుపు.. గిలిగింతలతో నను ఉసిగొలుపు నడిరాతిరి వేళ నీ పిలుపు.. గిలిగింతలతో నను ఉసిగొలుపు నును చేతులతో నను పెనవేసి.. నా ఒడిలో వాలును నీ వలపు ఇది తీయని వెన్నెల రేయి... మది వెన్నెల కన్నా హాయి

చరణం 2:

నా మనసే కోవెల చేసితిని.. ఆ గుడిలో నిన్నే నిలిపితిని నా మనసే కోవెల చేసితిని.. ఆ గుడిలో నిన్నే నిలిపితిని నీ ఒంపులు తిరిగే అందాలు.. కనువిందులు చేసే శిల్పాలు

ఇది తీయని వెన్నెల రేయి... మది వెన్నెల కన్నా హాయి. చరణం 3:

నీ పెదవులు చిలికే మధురిమలు.. అనురాగము పలికే సరిగమలు నీ పెదవులు చిలికే మధురిమలు.. అనురాగము పలికే సరిగమలు మన తనువులు కలిపే రాగాలు.. కలకాలం నిలిచే కావ్యాలు

ఇది తీయని వెన్నెల రేయి... మది వెన్నెల కన్నా హాయి నా ఊహల జాబిలి రేఖలు... కురిపించెను ప్రేమలేఖలు ఇది తీయని వెన్నెల రేయి... మది వెన్నెల కన్నా హాయి

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

appreciate your this effort ,keep serving

కామెంట్‌ను పోస్ట్ చేయండి