9, మార్చి 2024, శనివారం

Antham : O Maina Song Lyrics (ఓ మైనా ... ఆ ఆ)

చిత్రం: అంతం (1992)

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: కె.ఎస్.చిత్ర

సంగీతం: ఆర్. డి. బర్మన్



ఓ మైనా ... ఆ ఆ నీ గానం నే విన్నా ఆ ... ఆ ఆ ఎటు ఉన్నా ... ఆ ఆ ఆ ... ఏటవాలు పాట వెంట రానా ... ఆ ఆ కమ్మని గీతాలే పంపి రమ్మని పిలిచావే ... మరి రావే ఇకనైనా ... కొమ్మలనడిగానే ప్రతి రెమ్మని వెతికానే ... కనిపించవు కాస్తైనా ... నీ కోసం వచ్చానే సావాసం తెచ్చానే ఏదీ రా మరి ఏ మూలున్నా ... కమ్మని గీతాలే పంపి రమ్మని పిలిచావే ... మరి రావే ఇకనైనా ... కొమ్మలనడిగానే ప్రతి రెమ్మని వెతికానే... కనిపించవు కాస్తైనా ... నీ కోసం వచ్చానే సావాసం తెచ్చానే ఏదీ రా మరి ఏ మూలున్నా ... కమ్మని గీతాలే పంపి రమ్మని పిలిచావే ...

మరి రావే ఇకనైనా లాల్లలలల్లల్లా లాలలాలలలల్లల్లా

లలలాలాలాలాలాలా ... ఎవరైనా ... ఆ ఆ ఆ ... చూశారా ఎపుడైనా ... ఆ ఆ ఆ ఉదయానా ... ఆ ఆ ఆ ... కురిసే వన్నెల వానా ... హో కరిమబ్బులాంటి నడిరేయి

కరిగి కురిసింది కిరణాలుగా ఒక్కొక్క తారా చినుకల్లె జారి

వెలిసింది తొలికాంతిగా ... ఆ ... కరిమబ్బులాంటి నడిరేయి

కరిగి కురిసింది కిరణాలుగా ఒక్కొక్క తారా చినుకల్లె

జారి వెలిసింది తొలికాంతిగా నీలాకాశంలో వెండి సముద్రంలా పొంగే ... కమ్మని గీతాలే పంపి రమ్మని పిలిచావే ... మరి రావే ఇకనైనా కొమ్మలనడిగానే ప్రతి రెమ్మని వెతికానే ... కనిపించవు కాస్తైనా ... దుర్గా లక్ష్మీ నారాయణ నన్నేనా ...ఆ ఆ ఆ ... కోరుకుంది ఈ వరాల కోనా ... హో ఏలుకోనా ... ఆ ఆ ఆ ... కళ్ళ ముందు విందులి క్షణానా ... హో

సీతాకోకచిలుకా తీసుకుపో

నీ వెనుకా వనమంతా చూపించగా ... ఆ మొక్క ఈ మొలక అన్నీ తెలుసు

కనుక వివరించు ఇంచక్కగా ... సీతాకోకచిలుక తీసుకుపో

నీ వెనుక వనమంతా చూపించగా ... ఆ మొక్క ఈ మొలక అన్నీ తెలుసు

కనుక వివరించు ఇంచక్కగా ... ఈ కారుణ్యంలో నీ రెక్కే దిక్కై రానా ... కమ్మని గీతాలే పంపి రమ్మని పిలిచావే ...

మరి రావే ఇకనైనా కొమ్మలనడిగానే ప్రతి రెమ్మని వెతికానే ...

కనిపించవు కాస్తైనా నీ కోసం వచ్చానే సావాసం తెచ్చానే ఏదీ రా మరి ఏ మూలున్నా ... ఆహహహహ్హహ్హా ఓహోహోహోహోహ్హోహ్హో

లలలాలా హ్మ్మ్ హ్మ్మ్ హ్మ్మ్ హ్మ్మ్ డూడుడుడుడుడూ ఓహోహొహొహొహొహోహో

లలలాలాలాలాలాలా ...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి