9, మార్చి 2024, శనివారం

Little Soldiers : O Vendi Vennela song lyrics (ఓ ఓ ఓ వెండి వెన్నెలా)

చిత్రం: లిటిల్ సోల్జర్స్ (1996)

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: రామ్ చక్రవర్తి, ఎం. ఎం. శ్రీలేఖ, విష్ణుకాంత్

సంగీతం: శ్రీ కొమ్మినేని



పల్లవి : ఓ ఓ ఓ వెండి వెన్నెలా ఓ ఓ ఓ దిగిరా ఇలా అమ్మ కొంగులో చంటి పాపలా మబ్బు చాటునే ఉంటే ఎలా పడిపోతానని పసి పాదాలకి పరుగే నేర్పవా మదిలో దాగిన మధుభావాలకి వెలుగే చూపవా మనసుంటే మార్గముంది తెంచుకోవే సంకెల చరణం : 1 ఓ ఓ ఓ సుప్రభాతమా ఓ ఓ ఓ శుభమంత్రమా మేలుకొమ్మనే ప్రేమగీతమా చేరుకున్న నా తొలిచైత్రమా నీ స్వరాలతో నా నరాలలో ఒక గంగానది ఈ క్షణాన నీ జత చేరాలని అలలౌతున్నది వెల్లువలా చేరుకోనా వేచియున్న సంద్రమా చరణం : 2 అంత దూరమా స్వర్గమన్నది చిటికెలో ఇలా మనదైనది అందరానిదా స్వప్నమన్నది అందమైన ఈ నిజమైనది చిరుహాసానికి మా సంసారమే చిరునామా అని ఈ సంతోషమే మా సంతానమై చిగురించాలని ప్రతిరోజు పండుగల్లే సాగుతోంది జీవితం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి