చిత్రం: బావ మరదళ్లు (1984)
రచన: వేటూరి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి. సుశీల
సంగీతం: చక్రవర్తి
పల్లవి:: అ.హహహా...అహహహా..ఆ ఆ ఆ వెండి చందమామలు..వేయి తీపి రాత్రులు వెండి చందమామలు..వేయి తీపి రాత్రులు ఎండపూల జల్లులు..ఎవరి కోసము?..మ్మ్ ఒకరి కోసం ఒకరున్న..జంట కోసము..మ్మ్ బంధమైన అందమైన..బ్రతుకు కోసము..మ్మ్ వెండి చందమామలు..వేయి తీపి రాత్రులు వెండి చందమామలు..వేయి తీపి రాత్రులు ఎండపూల జల్లులు..ఎవరి కోసము?..మ్మ్ ఒకరి కోసం ఒకరున్న..జంట కోసము..మ్మ్ బంధమైన అందమైన..బ్రతుకు కోసము..మ్మ్ చరణం::1 ఘడియలైన కాలమంతా..ఘడియైనా వీడలేని ఘాఢమైన మమతలు..పండే కౌగిలి కోసం మధువులైన మాటలన్నీ..పెదవులైన ప్రేమలోనే తీపి తీపి ముద్దులు కొసరే..వలపుల కోసం నవ్వే నక్షత్రాలు..రవ్వల చాందినీలు పండినవే కలలు..అవి పరచిన పానుపులు నీవు లేక నాకు రాని..నిదర కోసము నిన్ను తప్ప చూడలేని..కలల కోసము వెండి చందమామలు..వేయి తీపి రాత్రులు అ..ఆ ఆ ఆ ఆ ఆ..ఏహే..ఆ..ఆ..ఆ..ఆ చరణం::2 తనువులైన బంధమంతా..క్షణమైనా వీడలేని అందమైన ఆశలు పూసే..ఆవని కోసం పల్లవించు పాటలన్నీ..వెలుగులైన నీడలలోనే తోడు నేను ఉన్నానన్నా..మమతల కోసం వెన్నెల కార్తీకాలు..వెచ్చని ఏకాంతాలు పిలిచే కోయిలలు..అవి కొసరే కోరికలు నిన్ను తప్ప కోరుకోని..మనసు కోసము నీవు నేను వేరు కాని..మనువు కోసము వెండి చందమామలు..వేయి తీపి రాత్రులు వెండి చందమామలు..వేయి తీపి రాత్రులు ఎండపూల జల్లులు..ఎవరి కోసము ఒకరి కోసం ఒకరున్న..జంట కోసము బంధమైన అందమైన..బ్రతుకు కోసము
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి