17, మార్చి 2024, ఆదివారం

Bombay : Kuchi Kuchi Kunamma Song Lyrics (కుచ్చి కుచ్చి కూనమ్మా పిల్లనివ్వు)

చిత్రం : బొంబాయి (1995)

సంగీతం: ఏ.ఆర్.రెహమాన్

సాహిత్యం: వేటూరి

గానం: హరిహరన్,స్వర్ణలత, జి.వి.ప్రకాష్ కుమార్ & శ్రద్ధ



పల్లవి :

కుచ్చి కుచ్చి కూనమ్మా పిల్లనివ్వు కుందనాల కూనమ్మా పిల్లనివ్వు ఊరువాడా నిద్దరోయె కోడి కూడా సద్దు చేసె కుచ్చి కుచ్చి కూనమ్మా కుందనాల కూనమ్మా కుచ్చి కుచ్చి కూనమ్మా పిల్లనివ్వు ఏ కుందనాల కూనమ్మా పిల్లనివ్వు ఊరువాడా నిద్దరోయె కోడి కూడా సద్దు చేసె కుచ్చి కుచ్చి కూనమ్మా కుందనాల కూనమ్మా కుచ్చి కుచ్చి కూనమ్మా ఇవ్వదంట నీ కొంటె వేషమింక చాలు వెళ్ళమంట ఊరువాడా సద్దులాయె కోడి కూడా నిద్దరోయె కుచ్చి కుచ్చి కూనమ్మా ఇవ్వదంట నీ కొంటె వేషమింక చాలు వెళ్ళమంట చరణం : 1

ఆట నెమలికి మెరుపు సుఖం గాన కోకిలకు పిలుపు సుఖం చెట్టు వేరుకు పాదు సుఖం ఏ అమ్మనాన్న పిలుపు సుఖం రాకుమారుడికి గెలుపు సుఖం చంటి కడుపుకి పాలు సుఖం మొగుడు శ్రీమతి అలకలలు ముద్దు కన్నా ముడుపు సుఖం రేయిపగలు పన్నీట్లో ఉన్నా రాదు మేనుకి చలికాలం అల్లిబిల్లిగా లాలిస్తుంటే గారాల పూబాల కోరేది సరసం బుజ్జి బుజ్జి పాపనివ్వు పోకిరాట వేషమొద్దు ఆ.ఆ... బుజ్జి బుజ్జి పాపనివ్వు పోకిరాట వేషమొద్దు వేడెక్కే అందాల పెట్టు వేదిస్తే నా మీదే ఒట్టు కుచ్చి కుచ్చి కూనమ్మా ఇవ్వదంట నీ కొంటె వేషమింక చాలు వెళ్ళమంట ఊరువాడా సద్దులాయె కోడి కూడా నిద్దరోయె కుచ్చి కుచ్చి కూనమ్మా ఇవ్వదంట నీ కొంటె వేషమింక చాలు వెళ్ళమంట ఊరువాడా సద్దులాయె కోడి కూడా నిద్దరోయె కుచ్చి కుచ్చి కూనమ్మా కుందనాల కూనమ్మా చరణం : 2

చిరుత రెక్కలే పక్షివిలే చిటెకె వెలుగులే దివ్వెవిలే తోడు నీడ ఇక నీవేలే తరగని పున్నమిలే తనువుతోటివే తపనలులే ఉరుముతోటివే మెరుపులులే ఉన్నతోడు ఇక నీవేలే విలువలు తెలియవులే భూమి తిరగడం నిలబడితే భువిని తాళమే మారదులే మగని ఆదరణ కరువైతే ఇల్లాలి ప్రేమంతా వేసంగిపాలె పొత్తు కోరుకున్న ఆశ అంటుకుంది అగ్గిలాగ పొత్తు కోరుకున్న ఆశ అంటుకుంది అగ్గిలాగ బుద్దిగుంటే మంచిదంట దూరాలు కోరింది జంట కుచ్చి కుచ్చి కూనమ్మా కుందనాల కూనమ్మా కుచ్చి కుచ్చి కూనమ్మా ఇవ్వదంట నీ కొంటె వేషమింక చాలు వెళ్ళమంట ఊరువాడా సద్దులాయె కోడి కూడా నిద్దరోయె కుచ్చి కుచ్చి కూనమ్మా ఇవ్వదంట నీ కొంటె వేషమింక చాలు వెళ్ళమంట ఊరువాడా సద్దులాయె కోడి కూడా నిద్దరోయె కుచ్చి కుచ్చి కూనమ్మా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి