చిత్రం: సర్కస్ రాముడు (1980)
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , పి.సుశీల
సంగీతం: కె.వి.మహదేవన్
పల్లవి: ఆకలి మీద అడపులి దీన్ని ఆపలేను భజరంగబలి మిర్రి మిర్రి చూస్తాది చిర్రు బుర్రుమంటాది. మింగిందా గోవిందా హరి హరి హరి హరి ప్రేమే ఎరుగని పెద్దపులి దీని మనసు మార్చు భజరంగబలి గుర్రు గుర్రు మంటాది గుచ్చి గుచ్చి చూస్తాది. మింగిందా గోవిందా హరి హరి హరి హరి చరణం: 1 తగల మాక నాయెంటబడి తల్లీ నీకో దండం పెడతా ఎనక్కి తిరిగి వెళ్ళకపోతే ఏనుగు తొండం పెట్టి కొడతా దండ యాత్రలకు బెదిరేదాన్నా దండం పెడితే వదిలే దాన్ని సరసం కాస్తా విరసం చేస్తే నీతో సర్కస్ చేయించేస్తా చరణం: 2 తోక ఒక్కటే తక్కువ గాని కోతి బుధ్ధి ఈ కోమలిది మచ్చ ఒక్కటే తక్కున గాని అమావాస్యలో జాబిలిది కొండ ముచ్చువని తెలిసే వచ్చా కొబ్బరంటి నా మనసే యిచ్చా చీ చీ ఫో పో అన్నా వంటే సింగం నోట్లో తల దూరుస్తా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి