చిత్రం: సర్కస్ రాముడు (1980)
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , పి.సుశీల
సంగీతం: కె.వి.మహదేవన్
పల్లవి: ఓ బొజ్జగణపయ్య నీ బంటు నేనయ్య నీ చవితెప్పుడో సెప్పవయ్య నా సవితెవ్వరొ సెప్పవయ్య ఓ బొజ్జగణపయ్య నీబంటు నేనయ్య నీ చవితెప్పుడో సెప్పవయ్య ఈ సవితి పోరే తీర్చవయ్య చరణం: 1 సంపంగితోటలో సనజాతి పువ్విస్తే కొంపంటుకున్నట్టు గగ్గోలు ఎన్నెట్లో జతగలిసి ఎచ్చగా కవ్విస్తే తేళ్ళు కుట్టినట్టు సోకాలు కిటుకేమిటో చెప్పు స్వామి అటుకులే పెడతాను స్వామి ఉన్నదేమిటో చెప్పు తండ్రీ ఉండ్రాళ్ళు పెడతాను తండ్రీ చరణం: 2 సందకాడ తనకు సలితిరిగినాదంటే పులిమీద పుట్రలా యమగోల సుక్కలొచ్చిన వేళ చూసి పోదామంటే కళ్ళతోనే కాల్చి చంపాలా? గొడవేమిటో చెప్పుస్వామి వడపప్పు పెడతాను స్వామీ పూనకం తగ్గించు తండ్రీ పానకం పోస్తాను తండ్రీ చరణం: 3 ఈణ్ణి నమ్మినాకు ఈడొచ్చి కూకుంది దాన్ని నమ్మిగుడె గూడెక్కి కూసింది వళ్ళు చూస్తే దాన్ని వాటేయమంటుంది. బుద్ధి చూస్తే వద్దు వద్దు పొమ్మంటుంది. చెరకు పెడతా నీకు స్వామి చేసెయ్యి మా పెళ్ళి స్వామి టెంకాయ కొడతాను తండ్రీ లగ్గమెప్పుడో చెప్పుతండ్రీ.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి