చిత్రం: సర్కస్ రాముడు (1980)
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం
సంగీతం: కె.వి.మహదేవన్
పల్లవి: ఏవండోయ్ - లేడీస్ ఏవండోయ్ - మిస్టర్స్ రాముడంటె రాముడు సర్కస్ రాముడు సర్కస్ రాముడు... సర్కస్ రాముడు సర్కస్... సర్కస్... సర్కస్... సర్కస్ రాముడు చరణం: 1 పర్మిట్ పక్షుల రాజ్యంలో డామిట్ బ్రతుకే సర్కస్ లిక్కర్ పర్మిట్ చక్కెర లైసెన్స్ అడిగావంటే సైలెన్స్ మంత్రి గారికి దణ్ణం పెట్టు డూడూడూడూడూ ఆఫీసర్లకి హారతి పట్టు డూడూడూడూడూ చెప్పేవి శ్రీరంగ నీతులు తీసేవి చల్లంగ గోతులు నీతిలేని ఈ సర్కస్ కన్నా కోతులు చేసే సర్కన్ మిన్న సిస్టర్స్ నోటియర్స్ బ్రదర్స్ నో ఫియర్స్ ఐయామ్ ఆల్వేస్ యువర్స్ చరణం: 2 కన్నెపిల్లకి పెళ్ళి చెయ్యడం కన్నతండ్రి కో సర్కస్ కడుపున కాళ్ళు పెట్టి బ్రతకడం కష్టజీనికో సర్కస్ అల్లుడి గారికి కట్నం పెట్టు డూడూడూడూడూ అలిగి నప్పుడు కాళ్ళే పట్టు డూడూడూడూడూ శ ్రీకృష్ణ పరమాత్మ పింఛము శ్రీరస్తు శుభమస్తు లంచము మనుషులు చేసే సర్కస్ కన్నా మృగాలు చేసే సర్కన్ మిన్న
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి