చిత్రం : దొంగ రాముడు(1955)
గాయని : ఆర్. నాగేశ్వరరావు, జిక్కి
రచయిత : సముద్రాల రాఘవాచార్య
సంగీతం : పెండ్యాల నాగేశ్వర రావు
పల్లవి: రారోయి మా ఇంటికి ... "మ్మ్" రారోయి మా ఇంటికి మావో మాటున్నది మంచి మాటున్నది... "హాహ్హా" మాటున్నది మంచి మాటున్నది ... "ఆఁ" చరణం 1: నువ్వు నిలిసుంటె నిమ్మ సెట్టు నీడున్నది... "ఆహా" నువ్వు కూసుంటె కురిసీలో పీటున్నది ... "ఆహా" నువ్వు తొంగుంటె పట్టె మంచం పరుపున్నది ...."అహ్హహ్హహ్హ .. భలే భలే".... మాటున్నది మంచి మాటున్నది రారోయి మా ఇంటికి ... "మ్మ్"... మావో మాటున్నది మంచి మాటున్నది చరణం 2: ఆకలైతే సన్నబియ్యం కూడున్నది .. "మ్మ్" నీకాకలైతే సన్నబియ్యం కూడున్నది .. "బావుంది బావుంది" అందులోకి అరకోడి కూరున్నది .. "అహహ్హ అవ్వల్రైట్ యెర్రీ గుడ్" అందులోకి అరకోడి కూరున్నది... "ఆఁ" ఆపైన రొయ్యప్పొట్టు చారున్నది ... "అహహ్హా.. అబ్బో అబ్బో" మాటున్నది మంచి మాటున్నది రారోయి మా ఇంటికి ... "అంతేగా"... మావో మాటున్నది మంచి మాటున్నది చరణం 3: రంజైన మీగడ పెరుగున్నది .... "బుర్ వీ... చీ చీ చీ చీ" నంజుకొను ఆవకాయ ముక్కున్నది ... "ఆహ్.. డోంట్ వాంట్" రోగమొస్తె ఘాటైన మందున్నది .. "అహ్.. అహహ అహ్హ" రోగమొస్తె ఘాటైన మందున్నది .. "ఆ" నిన్ను సాగనంప వల్లకాటి దిబ్బున్నది ... "అహ్హహహహహహ ఊ ఓహొహొహొహొ"
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి