22, మార్చి 2024, శుక్రవారం

Ganesh : Siri Siri Muvvalu Song Lyrics (సిరి సిరి మువ్వలు)

చిత్రం: గణేష్ (1998)

రచన: సిరివెన్నెల సీతారామ శాస్త్రి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం

సంగీతం: మణి శర్మ



పల్లవి :

సిరి సిరి మువ్వలు ఆ విరిసిన పువ్వులు చిరు చిరు ఆశలు ఈ గల గల ఊసులు కలబోసి చేసినవీ కిల కిల నవ్వులు వెలపోసి ఈ సిరులు కొనలేరెవ్వరు దేవుడే ఆ దివి నుండి పంపిన దీవెనలు ఎప్పుడూ ఈ కోవెలలో వెలిగే దీపాలు సిరి సిరి మువ్వలు ఆ విరిసిన పువ్వులు చిరు చిరు ఆశలు ఈ గల గల ఊసులు

చరణం 1 :

అల్లరంత సిరిమువ్వలై ఘల్లుఘల్లుమంటే నిలువలేక నిశ్శబ్దమే విసుగుపుట్టి పోదా సంతోషము కూడా తనకి చిరునామా అవ్వాలనీ కన్నీరూ చేరుకుంది తెగ నవ్వే మన కళ్ళనీ ఈ మణి కాంతి వెలుగుతు ఉంటే.. ఈ మణి కాంతి వెలుగుతు ఉంటే చీకటి రాదే కన్నులకెదురుగా

సిరి సిరి మువ్వలు ఆ విరిసిన పువ్వులు చిరు చిరు ఆశలు ఈ గల గల ఊసులు కలబోసి చేసినవీ కిల కిల నవ్వులు వెలపోసి ఈ సిరులు కొనలేరెవ్వరు దేవుడే ఆ దివి నుండి పంపిన దీవెనలు ఎప్పుడూ ఈ కోవెలలో వెలిగే దీపాలు సిరి సిరి మువ్వలు ఆ విరిసిన పువ్వులు చిరు చిరు ఆశలు ఈ గల గల ఊసులు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి