చిత్రం: జయసుధ (1976)
రచన: దాసరి నారాయణ రావు
గానం: పి. సుశీల
సంగీతం: పసుపులేటి రమేష్ నాయుడు
పల్లవి:
గోరువెచ్చని సూరీడమ్మా..
పొద్దుపొడుపులా వచ్చాడమ్మా
గోరువెచ్చని సూరీడమ్మా..
పొద్దుపొడుపులా వచ్చాడమ్మా
వద్దన్నా..రావద్దన్నా..గుండెల్లో
గుడిసె వేసి..అది గుడిగా చేసీ
ఆ గుడిలో..దాగున్నాడమ్మా..
ఆ గుడిలో దాగున్నాడమ్మా
గోరువెచ్చని సూరీడమ్మా..
పొద్దుపొడుపులా వచ్చాడమ్మా
చరణం 1:
మిట్టమధ్యానం నడినెత్తిన వచ్చాడు
మిట్టమధ్యానం నడినెత్తిన వచ్చాడు
ఒంటరిగా పోతుంటే ఎంటెంట పడ్డాడు..
వినకుండా పోతుంటే అరిచరిచీ పిలిచాడు..
ఆ..అ..హా ఆ..ఆఆ..పిలిచి పిలిచి
అలుపొచ్చి పైకెక్కానన్నాడు..
వెతకి వెతకి అలకొచ్చి ఏడెక్కానన్నాడు..
ఆ ఏడి దిగాలంటే నా తోడు కావాలంటా..
నే తోడు ఇస్తానంటే తను దిగి వస్తాడంటా..
గోరువెచ్చని సూరీడమ్మా..
పొద్దుపొడుపులా వచ్చాడమ్మా
వద్దన్నా..రావద్దన్నా..గుండెల్లో
గుడిసె వేసి..అది గుడిగా చేసీ
ఆ గుడిలో..దాగున్నాడమ్మా..
ఆ గుడిలో దాగున్నాడమ్మా
గోరువెచ్చని సూరీడమ్మా..
పొద్దుపొడుపులా వచ్చాడమ్మా
చరణం 2:
పొద్దుబూకే వేళ ఎదురుగా వచ్చాడు
పొద్దుబూకే వేళ ఎదురుగా వచ్చాడు
వెనుతిరిగీ పోతుంటే వెనకెనకా పిలిచాడు..
పోని అని తిరిగితే ఎరుపెక్కి ఉన్నాడు..
ఆ అ..హా ఆ..ఆఆ..ఆగి ఆగి
ఆగలేక దిగివచ్చానన్నాడు
చూసి చూసి మత్తెక్కి పిచ్చెక్కిందన్నాడు..
ఆ పిచ్చి దిగాలంటే నా తోడు కావాలంట
నే తోడు ఇస్తానంటే పొమ్మన్నా పోడంటా
గోరువెచ్చని సూరీడమ్మా..
పొద్దుపొడుపులా వచ్చాడమ్మా
గోరువెచ్చని సూరీడమ్మా..
పొద్దుపొడుపులా వచ్చాడమ్మా
వద్దన్నా..రావద్దన్నా..గుండెల్లో
గుడిసె వేసి..అది గుడిగా చేసీ
ఆ గుడిలో..దాగున్నాడమ్మా..
ఆ గుడిలో దాగున్నాడమ్మా
గోరువెచ్చని సూరీడమ్మా..
పొద్దుపొడుపులా వచ్చాడమ్మా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి